English   

స‌మంత మ‌రోసారి రెచ్చిపోయింది.. కానీ కానీ కానీ..

samanth akkineni post new photo in social media
2019-02-20 14:27:37

అవును.. స‌మంత మ‌రోసారి రెచ్చిపోయింది. కాక‌పోతే ఈ సారి కాస్త ప‌ద్ద‌తిగా రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. నాగార్జున కోప్ప‌డ్డాడ‌ని కాస్త బ‌ట్ట‌లు నిండుగా క‌ప్పుకుందో ఏమో కానీ ఇప్పుడు మాత్రం స‌మంత కొత్త ఫోటోషూట్ ఆక‌ట్టుకుంటుంది. తాజాగా త‌న సోష‌ల్ మీడియాలో ఈ ఫోటోలు పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఈ మ‌ధ్య ఎక్క‌డికి వ‌చ్చినా కూడా చాలా ప‌ద్ద‌తిగా రెడీ అయి వ‌స్తుంటే స‌మంత ఇంకా అందాల ఆర‌బోత‌కు పూర్తిగా దూరం అయిపోయిందేమో అనుకున్నారు అభిమానులు. పైగా అక్కినేని కోడ‌లైంది క‌దా ఆ మ‌ర్యాద కాపాడుతుంది అనుకున్నారు. కానీ త‌మ్ముడు త‌మ్ముడే.. పేకాట పేకాటే.. అన్న‌ట్లు ఆ మ‌ధ్య వ‌ర‌స‌గా రెచ్చిపోయింది స‌మంత‌.
పెళ్లైన త‌ర్వాత కూడా హాట్ షో మాత్రం త‌గ్గించ‌లేదు. కానీ ఇప్పుడు మ‌ళ్లీ త‌న మ‌ర్యాద తాను కాపాడుకునే ప‌నిలో ప‌డింది ఈ అక్కినేని కోడ‌లు. ఇప్పుడు చేసిన ఫోటోషూట్ లో మోడ్ర‌న్ గా ఉంది కానీ అందాలు మాత్రం ఆర‌బోయ‌లేదు. మొన్న‌టికి మొన్న బ్లాక్ డ్ర‌స్ లో వ‌చ్చిన ఒక ఫోటోషూట్ చూసి అక్కినేని అభిమానులు షాక్ అయ్యారు. కానీ ఇప్పుడు మాత్రం కాస్త హ‌ద్దుల్లోనే ఉంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ మ‌ధ్య ఎందుకో తెలియ‌దు కానీ కాస్త డోస్ త‌గ్గించింది. అయితే అప్పుడ‌ప్పుడూ ఇప్ప‌టికీ కాళ్లు క‌నిపించే డ్ర‌స్సులు.. క్లీవేజ్ షోల‌తో మ‌తులు పోగొడుతుంది అక్కినేని కోడ‌లు. స‌మంత అందాల ఆర‌బోత‌పై నాగార్జున కాస్త సీరియ‌స్ గానే ఉన్న‌ట్లు స‌మాచారం. మొత్తానికి ఎప్పుడు ఎలా మారుతుందో తెలియ‌ని లేడీ ఊస‌ర‌వెల్లిగా మారిపోయింది స్యామ్.

More Related Stories