English   

పాకిస్థాన్ ప్రధాన మంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేసిన వర్మ..

RGV
2019-02-21 09:28:47

రాంగోపాల్ వర్మ అప్పుడప్పుడు అద్భుతమైన పనులు చేస్తుంటాడు. ఆయనను చూసి ఎప్పుడు కాంట్రవర్సీలో ఉంటాడు అనుకుంటారు. కానీ ఆయన నిజంగా మేధావి. వర్మను అర్థం చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఆయన ఎవరికీ సాధ్యం కాని స్థాయిలో ఆలోచిస్తుంటాడు. ఇప్పుడు కూడా పుల్వామా దాడుల తర్వాత ఇండియాలో పాకిస్తాన్ పై ఆగ్రహావేశాలను చూసి ఒక ట్వీట్ పెట్టాడు వర్మ. అది కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత తన మనసులో భావాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు వర్మ. ఇండియాపై పాకిస్తాన్ దాడి చేస్తే ఏమొస్తుంది.. కూర్చొని మాట్లాడుకుందాం.. మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించుకుందాం అంటూ పాకిస్తాన్ ప్రధాని మాట్లాడాడు. 

ఒకవేళ మీరు యుద్ధం చేయడానికి సిద్ధం అయితే మేము కూడా సిద్ధంగానే ఉంటాం అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు ఇమ్రాన్ ఖాన్. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ పాకిస్థాన్ ప్రధాన మంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉన్న విభేదాలు కేవలం కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం దొరికేస్తుందా అంటూ పాక్ ప్రధానిని నేరుగా అడిగేసాడు వర్మ. ఒకవేళ అలా కూర్చొని మాట్లాడుకునే ఓపిక ఉంటే మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ సెటైర్ వేశాడు ఈ సంచలన దర్శకుడు. ఇప్పుడు వర్మ పెట్టిన ట్వీట్ కు ఇండియన్ వైడ్ గా ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వర్మ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటూ సోషల్ మీడియాలో పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తో ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు భారతీయ నెటిజన్లు. మొత్తానికి ఎప్పుడు సెటైర్లు వేసే వర్మ తన దేశభక్తిని ఇలా చూపించాడు.

More Related Stories