English   

జబర్దస్త్ కామెడీ షోపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు..

Naga-Babu
2019-02-21 09:59:11

ఈ మధ్యకాలంలో నాగబాబు కాంట్రవర్సీలతో చాలా దగ్గరగా ఉంటున్నాడు. ఒకప్పుడు ఏమీ తెలియని వాడిగా ఉండే మెగా బ్రదర్ ఇప్పుడు మాత్రం ప్రతి విషయంలోనూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు. చివరికి ఇప్పుడు తాను న్యాయనిర్ణేతగా ఉన్న జబర్దస్త్ షోపై కూడా మనసు విప్పి మాట్లాడారు మెగా బ్రదర్. ఈ మధ్య కాలంలో జబర్దస్త్ బాగా గాడి తప్పిందని.. ఇందులో బూతు కామెడీ ఎక్కువగా వస్తుందని విమర్శలు వస్తున్నాయి. ఇవి అటూ ఇటూ వెళ్లి చివరికి నాగబాబు చెవిన పడ్డాయి. దీనిపై పూర్తిగా క్లారిటీ ఇచ్చాడు మెగా బ్రదర్. అందరూ అనుకుంటున్నట్లు జబర్దస్త్ బూతు షో కాదని.. ఇందులో చాలా క్లీన్ కామెడీ వస్తుంది అంటున్నాడు. 

కొన్ని కోట్లమంది మనసారా నవ్వుకుంటున్నారని.. ఇలాంటి షోపై అభాండాలు వేయడం మంచిది కాదు అంటున్నాడు నాగబాబు. ఒకప్పుడు నిజంగానే కాస్త అడల్ట్ కామెడీ వచ్చినా కూడా ఈ మధ్య కాలంలో అది పూర్తిగా తగ్గిపోయింది అంటున్నాడు మెగా బ్రదర్. ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ లో ఒక్క చమ్మక్ చంద్ర మాత్రమే కాస్త అడల్ట్ కంటెంట్ తీసుకొని కామెడీ చేస్తాడు కానీ మిగిలిన వాళ్ళంతా చాలా క్లీన్ కామెడీ చేస్తున్నారు అంటూ సర్టిఫికెట్ ఇచ్చాడు నాగబాబు. బయట వస్తున్న బూతు కామెడీ షోలు.. సినిమాలతో పోలిస్తే జబర్దస్త్ చాలా ఉత్తమంగా ఉంది అంటున్నాడు నాగబాబు. ఈ షో పై లేనిపోని కామెంట్లు చేసి రేటింగ్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని.. కానీ అది ఎప్పటికీ జరగదు అంటున్నాడు మెగా బ్రదర్. ప్రజాభిమానం ఉన్నంతవరకు జబర్దస్త్ షోపై ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా ప్రేక్షకులు పట్టించుకోరు అంటున్నాడు నాగబాబు.

More Related Stories