English   

మహానాయకుడు కోసం బాలకృష్ణ సాహసం చేస్తున్నాడా..

NTR-Mahanayakudu
2019-02-21 10:53:32

సాహసం చేయరా డింభకా.. ఇప్పుడు బాలకృష్ణ ఇదే చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఈ రోజుల్లో ప్రీమియర్ షోస్ చేయడం అంటే సొంతంగా ఉరి తీసుకోవడమే. సినిమా బాగుంటే ఓకే కానీ లేదంటే మాత్రం దాంతో చెడుగుడు ఆడుకుంటారు క్రిటిక్స్. గత కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో ప్రీమియర్ షోలు వేయడమే మానేశారు దర్శక నిర్మాతలు. విడుదల రోజు ఉదయం బెనిఫిట్స్ కూడా చాలా చోట్ల ప్రదర్శించడం లేదు. జనరల్ ఆడియన్స్ కు పడే మార్నింగ్ షో తోనే ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా ఓపెన్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో బాలకృష్ణ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మహానాయకుడు సినిమాకు స్పెషల్ ప్రీమియర్ ఏర్పాటు చేశాడు. ఫిబ్రవరి 21 సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మహేష్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్ లో మహానాయకుడు స్పెషల్ ప్రీమియర్ ఉంది. 

ఇది చూసి నిజంగానే ఇండస్ట్రీలో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. కథానాయకుడు డిజాస్టర్ అయిన నేపథ్యంలో ఇంత నమ్మకంగా మహానాయకుడు సినిమా ప్రీమియర్ వేయడం అనేది చిన్న విషయం కాదు. దానికి తోడు చాలా మంది డిస్ట్రిబ్యూటర్ల భవిష్యత్తుతో కూడుకున్న విషయం సినిమాపై ఎంత నమ్మకం లేకపోతే ఒక రోజు ముందుగానే స్పెషల్ ప్రీమియర్ వేస్తాడు అంటూ బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మరోవైపు ఆయన కావాలనే రిస్కు తీసుకుంటున్నాడనే ప్రచారం కూడా జరుగుతుంది. కచ్చితంగా ఈ సినిమా విజయం అందుకుంటుందని ధీమాగా చెబుతున్నారు బాలకృష్ణ. మరోవైపు క్రిష్ ఈ సినిమాను పూర్తిగా ఎమోషనల్ కంటెంట్ తో నింపేసాడు. కథానాయకుడుతో పోలిస్తే ఇందులో కాస్త మసాలా కూడా ఎక్కువగానే ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ తో పాటు.. ఇందిరా గాంధీతో వచ్చే కొన్ని సన్నివేశాలు అద్భుతంగా కుదిరాయని తెలుస్తోంది. మరి ఇవి ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తాయనేది చూడాలి.

More Related Stories