English   

గోపీచంద్ ప్రమాదం...క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ !

gopichand
2019-02-21 11:37:01

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ లో భాగంగా ఆయన ప్రమాదవశాత్తు షూటింగ్ లో గాయపడ్డారు. ఈ ఘటనలో గోపీకి తీవ్రగాయాలు అయ్యాయి. దాంతో షూటింగ్ నిలిపివేసి హీరోను స్థానిక ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు సినిమా యూనిట్. దీంతో 'హీరో గోపీచంద్ కు తీవ్ర గాయాలు' అంటూ మీడియాలో వస్తున్న వార్తలు చూసి ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో గోపీచంద్‌ ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని దర్శకుడు సంపత్‌ నంది క్లారిటీ ఇచ్చారు. జయపుర‌ ఆసుపత్రిలో ఉన్న నా హీరో గోపీచంద్‌ను కలిశానని ఆ దేవుడి దయ వల్ల, అభిమానుల ఆశీర్వాదాల వల్ల ఆయన బాగానే ఉన్నారని, అభిమానులు బాధపడాల్సిన అవసరం లేదనీ ఆయన కోసం ప్రార్థించండి. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకోండని సంపత్‌ నంది ట్వీట్‌ చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో గౌతమ్‌ నంద సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. 2017లో విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. కానీ ఆశించిన విజయం సాధించలేకపోయింది. దీంతో వీరిద్దరూ మళ్ళీ పెయిరప్ అయి సినిమా మొదలు పెడుతున్నట్టు వార్తలు వచ్చాయి, ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది.

More Related Stories