English   

మరో బ్రాండ్ అంబాసిడర్‌ గా ఎన్టీఆర్ !

NTR
2019-02-21 05:13:23

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అటు సినిమాలతో పాటు ఇటు పలు సంస్థలకు ప్రచారకర్తగా, కొన్నిటికి అంబాసిడర్‌ గా దూసుకుపోతున్నారు. గతంలో బోరోప్లస్, నవరత్న ఆయిల్, మలబార్ గోల్డ్, సెలెక్ట్ మొబైల్స్ వంటి సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు మరొక బ్రాండ్ కోసం పని చేయనున్నారు. పార్లే ఆగ్రో కంపెనీ తమ పాపులర్ ప్రోడక్ట్ యాపీ ఫిజ్ సౌత్ స్టేట్స్ అడ్వర్టైజింగ్ కోసం తారక్ ను సెలెక్ట్ చేసుకుంది. తారక్ సౌత్ ఇండియా రీజియన్ మొత్తానికి ప్రచారకర్తగా పనిచేయనున్నారు. ఇప్పటికే ఉత్తరాదిలో ఈ ప్రొడక్టును బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రమోట్ చేస్తున్నారు. ఇండియన్ ప్రూట్ డ్రింక్ కేటగిరిలో 90 శాతం వాటా ఉన్న సంస్థ పార్లే అగ్రో ఇందు కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే హైదరాబాద్, చెన్నైలో పార్లే ఆగ్రో సంస్థకు ఉత్పత్తి కేంద్రాలు ఉండగా ఇటీవలే కర్నాటకలోని మైసూరులో కొత్తగా ప్లాంట్‌ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మూడు ప్లాంట్ల సామర్థ్యానికి తగ్గట్టుగా యాపీ ఫిజ్ అమ్మకాలు పెంచుకునేందుకు సంస్థ నిర్ణయించుకుంది. దక్షిణ భారతదేశంలో సేల్స్ పెంచుకునేందుకు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారకర్తగా ఉండడం వలన మరింత ప్రాచుర్యం పోందుతాయని, దీంతో దేశంలో నెంబర్ వన్ కంపనీ గా మారుతుందనే సదరు కంపెనీ భావిస్తోంది. 

More Related Stories