English   

అన్నీ పుకార్లే అని తేల్చేసిన కోన వెంకట్ !

Kona-Venkat
2019-02-21 12:37:16

భాగమతి తర్వాత కథానాయిక అనుష్క నుంచి మరో కొత్త సినిమా ప్రకటన ఏదీ రాలేదు. దీంతో ఆమె తర్వాతి సినిమా ఏంటని అభిమానుల్లో ఆసక్తి నెలకొన్న తరుణంలో ఆమె కొత్త సినిమాకు సంబంధించిన వివరాలను ప్రముఖ రచయిత కోన వెంకట్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కోన వెంకట్‌ అందించిన కథలో అనుష్క నటించనున్నారని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ తో కోన కార్పోరేషన్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనుందని ఆయన ప్రకటించాడు. ముందు నుంచీ వార్తలు వెలువడుతున్నట్లే ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మాధవన్, అనుష్క జంటగా నటించనున్నారని కూడా ఆయన కన్ఫాం చేశాడు. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో అనుష్కతో పాటు అంజలి, షాలినీ పాండేలు హీరోయిన్లుగా నటిస్తున్నారని చెప్పుకొచ్చాడు. అయితే ఈ మధ్య ఒక వార్త కూడా మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర కోసం రానా దగ్గుబాటిని చిత్ర యూనిట్ ఎంచుకుందని ప్రచారం జరిగింది. మార్చ్ లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ ప్రాజెక్టు రానా చేరికతో మరింత క్రేజీగా మారిందని అనుకున్నారు. ఈ వార్తలకు క్లారిటీ ఇచ్చేందుకో ఏమో రంగంలోకి దిగిన కోన వెంకట్ ఈ సినిమా తమిల్ వర్షన్ కి సంబందించిన అప్డేట్ త్వరలోనే ఇస్తామని అప్పటి దాకా దీనికి సంబంధించి వచ్చేవన్నీ పుకార్లే అని చెప్పుకొచ్చాడు మార్చ్ లో సెట్స్ మీదకి వెళుతున్న సమయంలోనే క్లారిటీ ఇస్తామని చెప్పుకొచ్చాడు. 

More Related Stories