English   

సివిల్ ఇంజినీర్స్ లో సన్నీ లియోన్‌ టాప్...అధికారులకు షాక్ !

Sunny-Leone
2019-02-21 13:09:54

సన్నీ లియోన్ అంటే తెలియని వారు ఒకప్పుడు ఉండేవారేమో అదేనండీ ఆవిడ పోర్న్ లో ఉన్నపుడు కానీ ఆమె అన్నీ వదిలేసి ఇప్పుడు బాలీవుడ్ లో సెటిల్ అయిపొయింది. అయితే తాజాగా సన్నీ లియాన్‌ కు సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటన నవ్వులు పూయిస్తూ కోపం తెప్పిస్తోంది. అదేంటంటే బీహార్‌ రాష్ట్రంలో పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ విభాగంలో సివిల్ ఇంజినీర్ పోస్టులను ప్రకటించారు. అయితే ఆ పోస్టు కోసం సన్నీ లియోన్ కూడా దరఖాస్తు చేసుకుందట. ఇదేందిది ఆమె అప్ప్లై చేస్తే తప్పేంటి అనుకుంటూన్నారా ? అయితే అప్ప్లై  చేసింది ఆమె కాదు, ఎవరో తిన్నది అరక్క చేసిన పని అది. ఎవరో మీడియా అటేన్షన్ కోసం పని చేసివుంటారని భావిస్తున్నప్పటికీ, ఈ విషయమై ఇంకా క్లారిటీ రాలేదు. పీహెచ్డీ అధికారులే ఈ విషయాన్ని స్వయంగా చెబుతూ జూనియర్ సివిల్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించగా, సన్నీ లియోన్ పేరుతో ఓ అప్లికేషన్ వచ్చిందని, ఆమె ఇంజినీరింగ్ డిప్లమాలో 98.5 శాతం మార్కులు తెచ్చుకున్నట్టుగా అప్లికేషన్‌లో రాశారని తెలిపారు. అయితే నిరుద్యోగులకి ఎంతో ముఖ్యమైన ఇలాంటి విషయాల్లో ఎలా ఇలాంటి ఆకతాయి పనులు చేస్తారని పలువురు మందిపడుతుండగా ఈ విషయం మీద స్పందించిన సన్నీ మాత్రం నాకు మంచి మార్కులు వచ్చినందుకు సంతోషంగా ఉందని అంటోంది.

More Related Stories