English   

త్రివిక్రమ్ గారు నన్ను పిలవడం ఏంటి.. హైపర్ ఆది రియాక్షన్..

Hyper-Aadi
2019-02-21 13:57:07

హైపర్ ఆది.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ చూసే ప్రేక్షకులతో పాటు నార్మల్ ఆడియన్స్ కు కూడా బాగానే పరిచయం. సినిమాలలో కూడా నటిస్తూ బిజీ అయిపోయాడు ఈ కుర్ర కమెడియన్. అయితే సినిమాలతో పాటు అప్పుడప్పుడు కాంట్రవర్సీలతో కూడా బాగానే దోస్తీ చేస్తుంటాడు హైపర్ ఆది. దానికి తోడు ఈయనపై ఎప్పటికప్పుడు గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి. అదేం విచిత్రమో కానీ హైపర్ అది కూడా ఇలా గాసిప్స్ రావడం బాగానే ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక ఇప్పుడు ఏకంగా ఒక పెద్ద రూమర్ వచ్చింది. త్రివిక్రమ్ నుంచి ఈయనకు పిలుపు వచ్చిందని.. ఆయన సినిమాలకు మాటలు రాయాల్సిందిగా హైపర్ ఆదిని కోరాడని మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. దీనికి హైపర్ ఆది ఇప్పుడు స్పందించాడు. త్రివిక్రమ్ గారు నన్ను పిలవడం ఏంటి.. ఇది మరి ఓవర్ గా అనిపించడం లేదు.. ఆయన సినిమాలకు కథ మాటలు ఆయనే రాసుకుంటాడు.. అలాంటిది తనని ఎందుకు పిలుస్తారు అని హైపర్ ఆది క్లారిటీ ఇచ్చాడు. అయినా కూడా మీడియాలో  తనను త్రివిక్రమ్ గారితో పోల్చడం మాత్రం గర్వంగా ఉంది అంటున్నాడు. ఈయన బుల్లితెరపై వేసే పంచ్ డైలాగులు చూసి బుల్లితెర ప్రేక్షకులు స్మాల్ స్క్రీన్ త్రివిక్రమ్ అని కితాబిచ్చేశారు. కానీ నిజంగానే బుల్లితెర వరకే హైపర్ ఆది పంచులు నవ్విస్తున్నాయి. వెండితెరపై మాత్రం సక్సెస్ కావడం లేదు. ప్రస్తుతానికి జబర్దస్త్ కామెడీ షోతో బిజీగా ఉన్నాడు హైపర్ ఆది.
 

More Related Stories