English   

సరికొత్త లుక్ తో శర్వానంద్ !

sharwanand
2019-02-21 09:18:40

టాలీవుడ్ యంగ్ హీరోల‌లో సెపరేట్ లేడీ ఫ్యాన్ బేస్ ఉన్న న‌టుడు శ‌ర్వానంద్. కెరీర్‌లో విభిన్న పాత్ర‌లు పోషిస్తూ వ‌స్తున్న శ‌ర్వానంద్ చివ‌రిగా ప‌డి ప‌డి లేచే సినిమాతో మనముందుకు వచ్చాడు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. అయితే ఇందులో శ‌ర్వానంద్ న‌ట‌న ప్రేక్ష‌కులని ఎంత‌గానో ఆకట్టుకుంది. ప్ర‌స్తుతం ఆయన సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఇద్దరు హీరోయిన్స్ తో ఓ సినిమా చేస్తున్నాడు . ఇందులో శ‌ర్వానంద్ రెండు డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో క‌నిపించ‌నున్నాడని వార్తలు వచ్చాయి. అయితే దాని మీద ఎటువంటి అధికారిక ప్రకటనా లేకపోయినా తాజాగా ఆయ‌న‌ లుక్ ఒకటి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. భారీ గడ్డంతో స‌రికొత్త హెయిర్ స్టైల్‌లో విజయ్ సేతుపతిని తలపించేలా శర్వా లుక్ ఉంది. ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం స్పెయిన్ లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం స‌మ్మ‌ర్‌ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. స్పెయిన్ లో ప్లాన్ చేసిన శర్వానంద్ - కాజల్ మీద ఒక సాంగ్ లో 250 మంది డాన్సర్లు పాల్గొనగా ఆ డాన్స్ సీక్వెన్స్ షూట్ చేశారు. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమా, గ్యాంగ్ స్టర్ డ్రామా అంటున్నారు. ఒక లుక్ అయితే అదిరింది మరో లుక్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

More Related Stories