English   

కోడి రామ‌కృష్ణ‌కు తీవ్ర అనారోగ్యం.. హాస్పిట‌ల్లో ద‌ర్శ‌క దిగ్గ‌జం.. 

Kodi-Ramakrishna
2019-02-21 09:36:39

తెలుగు ఇండ‌స్ట్రీలో అస‌లే ఇప్పుడు టైమ్ అస్స‌లు బాగోలేదు. వ‌ర‌స‌గా చెడు వార్త‌లు వినాల్సి వ‌స్తుంది. ఇలాంటి స‌మ‌యంలో ఇప్పుడు కోడి రామ‌కృష్ణ‌కు సీరియ‌స్ గా ఉంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈయ‌న ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో ఉన్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌న ద‌ర్శ‌కులంతా ఇప్పుడు గ్రాఫిక్స్ తో చెడుగుడు ఆడుకుంటున్నారు కానీ ఒక‌ప్పుడు విజువ‌ల్ ఎఫెక్ట్స్ ను ఎలా వాడుకోవాలో ప‌ర్ ఫెక్ట్ గా తెలిసిన ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ‌. అస‌లు గ్రాఫిక్స్ అంటే ప్రేక్ష‌కుల‌కు తెలియ‌ని కాలంలోనే అమ్మోరుతో అద్భుతం చేసాడీయ‌న‌. ఆ సినిమాలో వ‌చ్చిన విజువ‌ల్ ఎఫెక్ట్స్ కు అప్ప‌ట్లో ప్రేక్ష‌కులు నోరెళ్ల‌బెట్ట‌డం త‌ప్ప ఏం చేయ‌లేక‌పోయారు. ఆ త‌ర్వాత అంజి సినిమాలో విజువ‌ల్ ఎఫెక్ట్స్ కు ఏకంగా నేష‌న‌ల్ అవార్డ్ అందుకున్నారు కోడి. అరుంధ‌తి సంచ‌ల‌నం గురించి ఎవ‌రూ అంత తేలిగ్గా మ‌రిచిపోరు. 

లేడీ ఓరియెంటెడ్ సినిమాలు క‌నుమ‌రుగవుతున్న ఈ రోజుల్లో అరుంధ‌తితో సంచ‌ల‌నం సృష్టించారు కోడి రామ‌కృష్ణ‌. ఆ త‌ర్వాత ఆయ‌న నుంచి సినిమాలు రావ‌డం లేదు. వ‌చ్చినా అవి నిల‌బ‌డటం లేదు. అనారోగ్యం కార‌ణంగా ఈయ‌న సినిమాల‌కు దూరంగానే ఉన్నారు. ఇప్పుడు మ‌ళ్లీ కోడి రామకృష్ణ తీవ్ర అస్వస్థతకు లోన‌య్యారు. ఫిబ్ర‌వ‌రి 21 ఉదయం ఆయన అనారోగ్యానికి గురి కావడంతో ఆయ‌న్ని గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తరలించిన‌ట్లు తెలుస్తుంది. కోడి రామకృష్ణ కొన్ని రోజులుగా అనారోగ్యంతోనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్న‌ట్లుండి సీరియ‌స్ కావ‌డంతో ఆయ‌న్ని హాస్పిట‌ల్లో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు తెలుస్తుంది. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేయ‌నున్నారు వైద్యులు.

More Related Stories