English   

ప్రభాస్ కనిపిస్తే ఐ లవ్ యు చెప్తా.. వీలుంటే ముద్దు పెడతా..

Varalakshmi
2019-02-21 17:37:43

అందంగా ఉంటాడు.. ఆరడుగుల హైట్ ఉంటాడు.. అదిరిపోయే ఫిజిక్.. అబ్బాయిని చూసి ఇంతకంటే ఏం కావాలి అమ్మాయి ప్రేమలో పడిపోవడానికి. ఇప్పుడు ప్రభాస్ ను చూసి కూడా అమ్మాయిలు ఇదే అంటున్నారు. ఈయనకు బయటి నుంచి మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో కూడా అభిమానులున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే ప్రభాస్ ప్రభాస్ అంటూ ఆయన నామం జపిస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ కూడా ప్రభాస్ అభిమానులు లిస్టులో జాయిన్ అయిపోయింది. ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్. తన జీవితంలో ఎవరికైనా ఐ లవ్ యు చెప్పాల్సి వస్తే అది కేవలం బాహుబలి ప్రభాస్ కు మాత్రమే ఓపెన్ అయింది వరలక్ష్మి శరత్ కుమార్. 

అతను అంతగా నచ్చేశాడని.. ఓపెన్ గానే ఒప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. కుదిరితే అందరిముందు ముద్దు కూడా పెడతాను అంటోంది. ప్రస్తుతం హీరోయిన్ గా కాకుండా విలన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. గ్లామర్ షో చేసినా కూడా హీరోయిన్గా ఈమె సక్సెస్ కాలేదు. దాంతో ప్రతినాయక పాత్రలతో బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది. మొన్నటి వరకు విశాల్ తో సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు వచ్చాయి.. కానీ హైదరాబాద్ అమ్మాయి అనీషాతో విశాల్ ఎంగేజ్ మెంట్ అయిపోవడంతో ఈ వార్తలకు ఫుల్స్టాప్ పడినట్లు అయింది. దాంతో వరలక్ష్మి శరత్ కుమార్ కన్ను ప్రభాస్ పై పడింది. ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి చూడాలి వరలక్ష్మీ మాటలపై ప్రభాస్ ఎలా రియాక్ట్ అవుతాడో..

More Related Stories