English   

హనుమాన్ మాల వేసుకున్న హీరో నితిన్...అందుకేనా ?

Nithiin
2019-02-21 18:59:33

టాలీవుడ్ హీరో నితిన్ హ‌నుమాన్ దీక్ష తీసుకున్న‌ట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. దీక్ష వ‌ల‌న తాను చాలా శాంతంగా ఉన్న‌ట్టు పేర్కొన్న నితిన్ ఉద‌యాన్నే 5 గంటలకి లేచిన త‌న‌కి శ్రీ ఆంజ‌నేయం సాంగ్స్‌తో డే స్టార్ట్ అవుతుంద‌ని ఆ త‌ర్వాత పూజా కార్య‌క్ర‌మాలతో బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఆధ్యాత్మిక‌త‌తో తనలో స‌రికొత్త ఉత్సాహం ఇస్తుంద‌ని నితిన్ త‌న ట్వీట్‌లో తెలిపాడు. గతంలో ఆయ‌న న‌టించిన ‘లై , చల్ మోహన్ రంగ , శ్రీనివాస కళ్యాణం’ చిత్రాలు పరాజయాన్ని మిగల్చ‌డంతో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు నితిన్‌. ఛలో ఫేమ్ వెంకీ దర్శకత్వంలో భీష్మ అనే చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్. ఇంకా సెట్స్ మీదకు ఇంకా వెళ్ళలేదు. అందుకే ఇప్పుడు దేవుడి మీద భారం వేసి ఆంజనేయ మాల ధారణ చేశాడట నితిన్. ముందు నుండీ అయన ఆంజనేయ భక్తుడు కాకపోయినా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ ఆంజనేయం సినిమాలో నటించినప్పటి నుండి నితిన్ కు ఆంజనేయ స్వామి మీద గురి కుదిరింది. అప్పటి నుండి ఆయన ఆంజనేయుడి భక్తుడిగా మారిపోయాడు. మరి చూడాలి నితిన్ ఆ దేవుడి ఆశీసులతో అయినా మరో హిట్ కొడతాడో లేదో ?

More Related Stories