English   

మహానాయకుడుకి పోటీగా నాలుగు సినిమాలు !

NTR Maha Nayakudu ,Anjali CBI,Prementha Panichese Narayana and Mithai release on feb 22nd
2019-02-21 12:36:10

శుక్రవారం వస్తే సినిమా ప్రేమికులకి పండగే కానీ సంక్రాంతి తరువాత థియేటర్స్‌లో సరైన సినిమాలు లేక ప్రేక్షకులు మంచి సినిమా కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. సంక్రాంతికి విడుదలైన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘పేటా’, ‘ఎఫ్ 2’, ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో ఒక్క ‘ఎఫ్ 2’ తప్ప మిగిలిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిల బడ్డాయి. ఇక ఆ తరువాత వచ్చిన ‘మిస్టర్ మజ్ను’, ‘యాత్ర’, ‘లవర్స్ డే’, ‘దేవ్’ సినిమాలలో యాత్ర కాస్తా హిట్ టాక్‌ తో నడిచింది. ఇక ఈ శుక్రవారం ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ఐదు సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ నుండి రెండో పార్ట్ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ రేపు భారీ అంచనాల నడుమ విడుదల కానుంది. ఈ సినిమా పోటీగా మరో నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ బరిలో ఉండటం ఇంట్రస్టింగ్‌గా మారింది. టాలీవుడ్‌ కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్ లో నటించిన ‘మిఠాయి’. హీరోయిన్‌ నయనతార లేటెస్ట్ మూవీ 'అంజలి సి.బి.ఐ'.  బోల్డ్ అడల్ట్ కంటెంట్‌తో తెరకెక్కించిన 4 లెటర్స్’, ఎప్పుడో నాగార్జునతో ‘ఎదురులేని మనిషి’ చిత్రాన్ని తెరకెక్కించిన జొన్నలగడ్డ శ్రీనివాసరావు కొడుకు హరిక్రిష్ణను హీరోగా చేస్తూ తీసిన సినిమా ‘ప్రేమెంత పనిచేసే నారాయణ’. ఇలా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాతో పోటీ పడుతూ నాలుగు చిత్రాలు రేపు విడుదల కానున్నాయి. అయితే వీటిలో చెప్పుకోతగ్గ సినిమా ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ అనడంలో సందేహం లేదు. అయితే ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ఎఫెక్ట్ ఈ చిత్రంపై పడటంతో పెద్దగా అంచనాలు లేకుండానే విడుదల అవుతుంది. చూడాలి మరి ఏమవుతుందో ?

More Related Stories