English   

సైలెన్స్ వీడింది...హాలీవుడ్ నటుడు కూడా !

michael madsen in anushka shetty  silence subbaraju is confirmed
2019-02-21 14:11:25

అనుష్క గతేడాది మొదట్లో బాగమతి అనే సినిమాతో ప్రేక్షకులని అలరించి ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిన తరువాత అనుష్క బరువు తగ్గే పనిలో పడింది. మళ్ళీ సంవత్సరం తర్వాత ఇపుడు ఆమె తాజా ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా ప్రకటించారు. గత కొంత కాలంగా అనుష్క 'సైలెన్స్' అనే సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రానుందని వార్తలు వస్తూనే ఉన్నాయి కదా ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ అనుష్క తదుపరి సినిమా సైలెన్స్ వీడింది. ఈ సినిమాకు సంబంధించి వివరాలతో కూడిన పోస్టర్‌ను సుబ్బరాజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు. దీంతో వార్తలు వచ్చినట్టే సినిమాలో మాధవన్, అంజలి, సుబ్బరాజు, శాలిని పాండేతో పాటుగా కాగా, ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడ్సెన్‌ నటిస్తున్నట్టు ప్రకటించారు. 61 ఏళ్ల ఈ నటుడికి రూ.3 కోట్ల పారితోషకం ఇచ్చేందుకు కూడా సిద్ధపడ్డారని, కథ విన్న మాడ్సెన్ ఎంతో ఆనందం వ్యక్తం చేశారని కూడా  అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అనుష్క చిత్రంలో మైఖేల్ మాడ్సెన్ నటిస్తున్నట్లు పోస్టర్ తో కన్ఫాం చేశాడు సుబ్బరాజు. ఈ సినిమా కోసం ప్రముఖ నటులు, టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ గోపీ మోహన్ లు ఈ సినిమాకు కథను అందించడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహస్తున్నారు. తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అత్యధిక శాతం అమెరికాలోనే చిత్రీకరించనున్నారట. వస్తాడు నా రాజు ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు

More Related Stories