English   

కేస‌రి ట్రైల‌ర్ టాక్...కేసరి అంటే అరాచకమే

Akshay Kumar's Kesari trailer is out
2019-02-21 14:50:33

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ న‌టిస్తున్న కేస‌రి సినిమా రిలీజ్ కు సిద్దమవుతోంది. ఈ సినిమాలో హ‌ల్వీద‌ర్ ఇషార్ సింగ్ ఒక సిక్కు యోధుడిగా కనిపించనున్నాడు అక్ష‌య్. 1897లో బ్రిటీష్ ఇండియన్ బృందాలకు, ఆఫ్ఘనిస్థాన్ బృందాలకు మధ్య జరిగిన సరాగర్హి యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తెర‌కెక్కింది. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఫిలింస్ మ‌రియు ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్‌లతో ‘కేసరి’ సినిమాపై అంచనాలు పెంచిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో భారతీయులు అంతా బానిసలు ఈ మట్టిలో అందరు పిరికివాళ్లే పుడతారు అంటూ ఒక ఇంగ్లీష్ వాడు అక్షయ్ తో అన్న డైలాగులతో ప్రారంభమవుతుంది.

 

21 మంది సిక్కు యోధులు పదివేల మంది అఫ్ఘనులను ఎలా ఓడించారనేదే ఈ సినిమా స్టోరీ. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా ప‌రిణితీ చోప్రా న‌టిస్తుంది. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి విడుద‌లైన టీజ‌ర్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ని పీక్ స్టేజ్‌కి తీసుకెళ్లిందనే చెప్పాలి. ఇందులో స‌న్నివేశాలు రోమాలు నిక్క‌పొడుచుకునేలా చేస్తున్నాయి.   ‘కేసరి’ అంటే త్యాగానికి గుర్తు. సిక్కులు కూడా త్యాగానికి గుర్తు అన్నట్టు ఈ సినిమాలో చూపించారు.  ‘నేను ధరించిన ఈ తలపాగా కేసరి, కారుతున్న నా నెత్తురు కేసరి..’ అంటూ అక్షయ్‌ చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను మార్చి 21న  రిలీజ్ చేయనున్నారు.

More Related Stories