English   

మహానాయకుడు రివ్యూ 

Mahanayakudu
2019-02-22 02:49:13

కథానాయకుడు సినిమా ఫ్లాప్ కావడంతో నందమూరి అభిమానుల ఆశలతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఇపుడు మహా నాయకుడు సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఫలితం బాగుంటే మరింత ఉత్సాహంగా ఎన్నికలకు వెళ్లాలని వాళ్లు ఆలోచిస్తున్నారు. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.

కధ :

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళ్లడంతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత ఆయన 9నెలల్లోనే ముఖ్యమంత్రి కావడం, అక్కడి నుంచి అసలు రాజకీయాలు మొదలవుతాయి. ఆయన చుట్టూనే ఉంటూ అధికారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు నాదెండ్ల భాస్కరరావు. ఆ తర్వాత బసవతారకం అనారోగ్యం కారణంగా ఆయన అమెరికా వెళ్తాడు. ఎన్టీఆర్ అమెరికా వెళ్ళిన తర్వాత ఎన్టీఆర్‌ బాగా నమ్మిన నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్‌కు సీఎం కుర్చీని దూరం చేయడం, తిరిగి ఎన్టీఆర్ ఢిల్లీ స్థాయిలో పోరాడి రాష్ట్రపతిని కలిసి తిరిగి రెండోసారి సీఎం‌గా ప్రమాణ స్వీకారం చేయడం క్యాన్సర్‌తో పోరాడుతూ ఎన్టీఆర్‌ని ముఖ్యమంత్రిగా చూడాలని కలలు కన్న బసవతారకం చివరి కోరికను నెరవేర్చుకోవడం అనేది కథ.

విశ్లేషణ :

కథానాయకుడు సినిమాలో ఉన్న ప్రధానమైన మైనస్ రెండు గంటల యాభై నిమిషాల నిడివి. ఈ సారి మాత్రం అది లేకుండా జాగ్రత్తపడ్డాడు క్రిష్. తాను చెప్పాలనుకున్న కథలు చాలా వేగంగా చెప్పాడు కేవలం రెండు గంటల ఎనిమిది నిమిషాల నిడివితో చెప్పేసాడు. సినిమా మొదలైన రెండు నిమిషాల్లోనే నేరుగా చైతన్యవంతం మొదలు పెట్టి అసలు కథ స్టార్ట్ చేశాడు క్రిష్. ఆ తర్వాత తొమ్మిది నెలల్లోనే ఆయన అధికారంలోకి రావడం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో బిజీ కావడం అన్ని జరిగిపోతాయి. దాంతో పాటే నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్ వెనకాల వెన్నుపోటు పొడవడానికి సిద్ధపడే సన్నివేశాలు కూడా ఉన్నాయి. వాటిని చాలా ఆసక్తికరంగా రాసుకున్నాడు దర్శకుడు క్రిష్. ఫస్టాఫ్ మొత్తం ఎన్టీఆర్ జనాల్లోకి వెళ్లడం గెలవడం వరకు చూపించాడు. ఇంటర్వెల్ నుంచి అసలు రాజకీయాలు మొదలుపెట్టాడు దర్శకుడు. ఆ తర్వాత ఆయన అమెరికా వెళ్లిన వెంటనే ఇక్కడ నాదెండ్ల భాస్కర రావు గద్దె ఎక్కడం, ఢిల్లీ స్థాయిలో ఎన్టీఆర్ పోరాటం, అన్ని బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఇందిరాగాంధీతో ఆయన తలపడే సన్నివేశాలు చాలా బాగున్నాయి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో కాలరాయడం సరికాదు అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగులు అద్భుతంగా ఉన్నాయి. ఆ తర్వాత ప్రజా మీటింగులు ఎమ్మెల్యేలను దాచిపెట్టడం వాళ్లను కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు చేసే ప్రణాళికలు ఇవన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే మహా నాయకుడు ఎంత ఆసక్తికరంగా ఉన్నా కూడా ఎందుకు అసంపూర్తి గా అనిపించింది. కేవలం బసవతారకం కోణంలోనే సినిమా సాగడం దీనికి ఒక కారణం. అడుగడుగునా చంద్రబాబు నాయుడు పాత్రలో హీరో చేసే ప్రయత్నం చేసాడు దర్శకుడు క్రిష్. ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు మాత్రమే తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

నటీనటులు :

ఎన్టీఆర్ పాత్రకు మరో సారి ప్రాణం పోసాడు నందమూరి బాలకృష్ణ కథానాయకుడులో అంతగా సరిపోలేదు అనే విమర్శలు ఎదుర్కొన్నా ఈసారి మాత్రం అద్భుతంగా నటించాడు బాలకృష్ణ. విద్యాబాలన్ ఎమోషనల్ గా చాలా బాగుంది.  అత్యంత కీలకమైన నాదెండ్ల భాస్కర రావు పాత్రలో మరాఠీ నటుడు సచిన్ కేడ్కర్ బాగా నటించాడు. చంద్రబాబు నాయుడు పాత్రకు రానా ప్రాణం పోశాడు మిగిలిన అన్ని పాత్రలు అందరూ బాగా నటించారు. మహా నాయకుడు సినిమాకు సంగీతం ప్రాణం పోసింది కీరవాణి చాలా అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ పర్లేదు ఎడిటింగ్ ఈ సినిమాకు బలం. కేవలం రెండు గంటల్లోనే సినిమాను పూర్తి చేశాడు దర్శకుడు క్రిష్. కథానాయకుడు తో పోలిస్తే మహానాయకుడు ఆసక్తికరంగా సాగింది. దర్శకుడిగా ఈ సినిమా పరీక్ష పెట్టింది దాన్ని దాదాపుగా సక్సెస్ అయ్యాడు క్రిష్. అయితే ప్రేక్షకులకు ఇది ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది మాత్రం ఆసక్తికరం.

చివరగా: మహానాయకుడు ఫుల్ ఆఫ్ పాలిటిక్స్

రేటింగ్: 2.5/5

More Related Stories