English   

కళ్యాణ్ రామ్ సినిమా రిలీజ్ చేయనున్న దిల్ రాజు !

Dil-Raju
2019-02-22 10:47:31

డిస్త్రిబ్యూటర్ గా, నిర్మాతగా, కాసులు కురిపించే కథలు డిసైడ్ చేయగల అనలిస్టుగా, దర్శకుల్ని తయారు చేసే ఫ్యాక్టరీగా దిల్ రాజుకి మంచి పేరుంది. ఈ గతేడాది కాస్త ఎక్కువ ఫ్లాపులతోనే ఇబ్బంది పడ్డా ఎఫ్ 2తో మళ్ళీ ఫాంలోకి వచ్చేశాడు. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి దియేటర్ లు ఎక్కువ ఉన్న ముగ్గురు నిర్మాతల్లో ఆయన ఒకరు. అందుకే ఆయన ఒక సినిమా కొన్నారంటే అందరి కళ్లు ఆ సినిమా మీదకు తప్పక వెళతాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా గుహన్ దర్శకత్వం వహించిన 118 చిత్రాన్ని దిల్ రాజు కొనుగోలు చేశారని తెలుస్తోంది. బుధవారం సాయంత్రం 118 ఆర్ఆర్ ప్రివ్యూ చూసి సినిమా తెగ నచ్చడంతో తెలుగు రాష్ట్రాల హక్కుల్ని ఆయనే కోనేసారట. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. ట్రైలర్ రిలీజై ఇప్పటికే ఆకట్టుకుంది. కళ్యాణ్ రామ్ స్టైలిష్ లుక్ కి చక్కని స్పందన వస్తోంది. చూడాలి ఈ సినిమా మరి దిల్ రాజు కి కాసులు కురిపిస్తుందో లేదో  ?

More Related Stories