English   

ఎన్టీఆర్ బ్యాక్ టు షూట్...మరో ఇంటరెస్టింగ్ అప్డేట్ !

Jr-NTR
2019-02-22 04:40:46

ప్రస్తుతం దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ చరణ్ లు కలిసి ఒక క్రేజీ మల్టీ స్టారర్ లో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య ఎన్టీఆర్ షూటింగ్ నుండి చిన్న బ్రేక్ తీసుకొని కుటుంబంతో కలిసి దుబాయ్ ట్రిప్‌కు వెళ్లారు. హాలిడే టూర్‌ను ఎంజాయ్ చేసిన తారక్ తన పాత్రకు సంబంధించిన కొన్ని కాస్టూమ్స్‌ను కూడా దుబాయ్‌లోనే షాపింగ్ చేయాల్సి ఉందని కూడా వార్తలు వచ్చాయి. అయితే దుబాయ్ ట్రిప్ ముగించుకొని ఎన్టీఆర్ తాజాగా హైదరాబాద్‌కు తిరిగివచ్చారట. అంతేకాక నిన్నటి నుండీ తారక్ ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్‌ లో కూడా పాల్గొంటున్నారని తెలిసింది. ఈ సారి జరగనున్న లాంగ్ షెడ్యూల్‌ లో రామ్‌ చరణ్‌ తో కలిసి ఎన్టీఆర్ షూటింగ్‌ లో పాల్గొననున్నారని సమాచారం. ఈ షెడ్యూల్‌ లోనే కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని యూనిట్ వర్గాల నుండి అందుతోన్న సమాచారం. ఎన్టీఆర్ గత సినిమా అరవింద సమేతలో స్లిమ్ లుక్‌ లో కనిపించగా ఆర్‌ఆర్‌ఆర్ కోసం కొంత బరువు పెరిగారట. అయితే ఈ సినిమాలో చరణ్ పోలీస్ గా ఎన్టీఆర్ బందిపోటు-స్వాతంత్ర్య సమరయోధుడు గా కనిపించనున్నాడని వార్తలు రాగా ఎన్టీఆర్ కూడా పోలీస్ అధికారి పాత్రనే చేస్తున్నాడనేది తాజా సమాచారం. మరి దీని మీద అధికారిక సమాచారం వచ్చే వరకూ ఏమీ కన్ఫాం చేయలేం.

More Related Stories