English   

రతన్ టాటాగా బొమన్ ఇరానీ !

Boman-Irani
2019-02-22 05:18:29

నరేంద్ర మోడీ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వివేక్‌ ఒబేరాయ్‌ ముఖ్య పాత్రలో అదే మోడీగా కనిపించబోతున్నాడు. ఇందులో బర్ఖ బిష్తా మోడీ భార్య జషోద బెన్‌ గానూ, ప్రధాని తల్లి హీరాబెన్‌ మోడీగా జరీనా వాహబ్‌ నటిస్తున్నారు. ఇక ఆయనకు అత్యంత సన్నిహితమయిన అమిత్ షా గా     మనోజ్ జోషి అనే మరాఠా నటుడు నటిస్తున్నాడు. వీరి పాత్రలకు సంబంధించి ఫస్ట్‌లుక్స్‌ ఇదివరకూ విడుదలయ్యాయి. మేరీ కొమ్ డైరెక్టర్ ఓమంగ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బొమన్‌ ఇరానీ ఓ పాత్రలో కనిపింబచోతున్నాడు. ఆయన బిలయనీర్, వ్యాపారవేత్త రతన్‌ టాటా పాత్ర పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.  ఇక ఈ సినిమాలో పలువురు సీనియ‌ర్ న‌టులు కూడా చిత్రంలో ముఖ్యపాత్ర‌లు పోషిస్తున్నారు. వివేక్‌ తండ్రి సురేశ్‌ ఒబెరాయ్‌, సందీప్‌ సింగ్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముందు ఎన్నికల ముందే సినిమా రిలీజ్ చేయాలనీ భావించినా దానికి సమయం చాలక పోవడంతో ఈ యేడాది ద్వితీయార్థంలో విడుద‌ల కానుందని అంటున్నారు.  మొత్తం 23 భాషల్లో ఈ సినిమా డుదలకానుంది. ఈ సినిమాలోని పాత్ర‌ల‌కి సంబంధించిన లుక్స్ విడుద‌ల చేస్తూ మూవీపై అంచనాలు పెంచుతున్నారు మేక‌ర్స్.

More Related Stories