English   

మహేష్ కోసం హైదరబాద్ వస్తున్న మేడం టుస్సాడ్స్ !

Mahesh
2019-02-22 05:40:15

సింగపూర్‌ లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మహేష్‌ మైనపు విగ్రహాన్నిఉంచ‌నున్న‌ట్టు ఇటీవ‌లి కాలంలో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలు నిజం కానున్నాయి. అయితే ఆ విగ్రహాన్ని అక్కడ ఉంచడానికి అంత‌కు ముందు మహేష్‌కు చెందిన ఏఎంబీ థియేటర్‌ లో ఈ విగ్రహాన్నిఉంచ‌నున్నారు. మార్చి 25న వ్యాక్స్ విగ్ర‌హాన్ని మ‌హేష్ లాంచ్ చేయ‌నున్నారు. ఒక్క రోజు మాత్ర‌మే ఈ విగ్ర‌హం ఏఎంబీ సినిమాస్ లో ప్రదర్శనకు ఉంచుతారు. సింగపూర్ మేడం టుస్సాడ్స్ వాళ్ళు ఇలా ఒక ప్రముఖుని ప్రతిమ ని  సింగపూర్ లో కాకుండా బయట దేశంలో ఆవిష్కరించడం ఇదే తొలిసారి. అయితే ఈ స్టాచ్యూ లాంచింగ్ ఈవెంట్‌ ని ఘ‌నంగా జ‌ర‌పాల‌ని థియేట‌ర్ యాజ‌మాన్యం భావిస్తుంద‌ట‌.  ఈ సందర్భంగా అభిమానులు అభిమాన హీరో ని పోలివుండే ప్రతిమతో సెల్ఫీలు, ఫోటోలు పంచుకునే అవకాశం ఆ ఒక్క రోజు లభించనుంది. తర్వాత మహేష్ మైనపు ప్రతిమ మేడం టుస్సాడ్స్ సింగపూర్ లో అంగరంగ వైభవంగా జరిగే ఐఫా ఉత్సవాల్లో భాగం కానుంది.  ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మహ‌ర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More Related Stories