English   

వెంకీమామ ముహూర్తం కుదిరింది !

Venky-Mama
2019-02-22 14:25:47

ఎఫ్2 తర్వాత వెంకటేష్ నటిస్తున్న మరో మల్టీ స్టారర్ సినిమా వెంకీ మామ. జై లవకుశ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో 'వెంకీమామ' వెంకటేశ్ , నాగచైతన్య మెయిన్ లీడ్స్ గా రూపొందుతోంది. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ మల్టీస్టారర్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి ముహూర్తాన్ని ఖరారు చేసింది సినిమా యూనిట్. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు ఇప్పటిదాకా క్లారిటీ ఇవ్వలేదు. ఇది పూర్తి వినోదభరితంగా సాగే కథ కావడంతో ఈ సినిమాలో క‌థానాయిక‌లుగా ఎవ‌రు న‌టిస్తారు అనే దానిపై కొన్నాళ్ళుగా ప‌లు వార్త‌లు వినిపిస్తున్నాయి. వెంకీ స‌ర‌స‌న పాయ‌ల్ రాజ్‌పుత్ ఫైన‌ల్ కాగా, చైతూ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ లేదా న‌భా న‌టేష్ న‌టిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఇటీవ‌ల మంచి స‌క్సెస్‌లు సాధిస్తున్న రాశీ ఖ‌న్నాని చైతూకి జోడీగా ఎంపిక చేసార‌ని అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు బాబీతో కలిసి కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
 

More Related Stories