English   

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత !

Kodi-Ramakrishna
2019-02-22 15:32:35

అలనాటి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కోడిరామకృష్ణ ఇక లేరు. గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ కొద్ది నిమిషాల క్రితం మృతి చెందారు. తెలుగు సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన కోడి రామకృష్ణ 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. సినిమా తో దర్శకుడిగా పరిచయమయ్యారు. దాదాపు టాలీవుడ్ లోని అగ్రనటులందరితోనూ సినిమాలు తీసిన్ ఆయన తెలుగులోనే కాక తమిళ, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలకూ దర్శకునిగా పనిచేశారు. అప్పట్లో దాసరి నారాయణరావు ఒకేసారి రెండు, మూడు సినిమాలకు దర్శకత్వం వహిస్తూండేవారు. ఆ క్రమంలో ఎవరికి వారే యమునా తీరే, స్వర్గం నరకం, మనుషుల్లో దేవుడు అన్న మూడు సినిమాలకు కోడి రామకృష్ణను అసిస్టెంట్ గా తీసుకున్నారు, అక్కడితో ఆయన పయనం ప్రారంభం అయ్యింది. సినిమాల్లో గ్రాఫిక్స్ ఉపయోగించటంలో ఆయననే ఆద్యుడిగా చెబుతారు. ఆయన బాలకృష్ణతో తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. మంగమ్మగారి మనవడు బిగ్గెస్ట్ హిట్. కోడి రామకృష్ణ అనగానే నుదట హెడ్ బ్యాండ్ కనిపిస్తూ ఉంటుంది. 100 సినిమాలకు పైగా దర్శకత్వం వహించి రికార్డ్ సృష్టించారు. అనుష్కకి స్టార్ హీరోయిన్ హోదా కట్టబెట్టిన అరుందతి సినిమా కూడా ఆయనదే. ఆయన చివరిగా తెరకెక్కించిన సినిమా నాగారాహువు అనే కన్నడ సినిమా. రామకృష్ణ మృతితో టాలీవుడ్‌లో విషాదచాయలు అలుముకున్నాయి. 

More Related Stories