English   

హీరో లేకుండానే సెట్స్ మీదకు వచ్చిన వాల్మీకి !

Valmiki
2019-02-22 16:10:40

ప్రతీ కధకు వైవిధ్యమైన పాత్రలనే ఎంచుకుంటూ తన టాలెంట్‌ ను పెంచుకుంటూ వెళ్తున్న వరుణ్‌ తేజ్ కొత్త ప్రాజెక్టు మొదలైంది. దర్శకుడు హరీశ్ శంకర్ తమిళంలో సూపర్ హిట్ అనిపించుకున్న జిగర్తాండ తెలుగు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వాల్మీకి అనే టైటిల్ పెట్టడం కూడా అందరికీ విదితమే. ఇప్పటికే ప్రాజెక్టులోకి వరుణ్ తేజ్ ఫైనల్ అయితే  హీరోగా అథర్వ మురళిని తీసుకునే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా వరుణ్ తేజ్ తో సినిమా షూటింగ్ మొదలయ్యింది. హీరో లేకుండా సినిమా సెట్స్ పైకి రావడం కొత్తేం కాదు. కానీ ఇక్కడే సినిమాలో హీరో ఎవరనేది ఫిక్స్ అవ్వకుండానే ఈ మూవీ సెట్స్ మీదకు వచ్చింది. వరుణ్ తేజ్ ఉన్నాడుగా అని మీరు అనుకోవచ్చు, కానీ వరుణ్ ది హీరో పాత్ర కాదు విలన్ పాత్ర.  దీంతో హీరో లేకుండా వాల్మీకి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైనట్టు అయ్యింది. 14 రీల్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం సమకూరుస్తున్నాడు.  

More Related Stories