English   

కోడి రామకృష్ణ మృతికి సంతపాల వెల్లువ...అక్కడే అంత్యక్రియలు !

Tollywood
2019-02-22 10:24:09

కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ ఈరోజు మృతి చెందిన విషయం తెలిసిందే. హైదారాబాద్ లోని గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు. కోడి రామకృష్ణ భౌతికకాయాన్ని ఫిలింనగర్ లోని ఆయన నివాసానికి తరలించనున్నారు. రేపు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో కోడి రామకృష్ణ అంత్యక్రియలు నిర్వహించనుట్టు ఆయన బంధువులు తెలిపారు. ఆయన మృతికి టాలీవుడ్ యావత్తూ సంతాపం తెలియచేస్తోంది. 

బాలకృష్ణ :
ఆయన మరణించడం ఎంతో బాధాకరమని నందమూరి బాలకృష్ణ అన్నారు. అనారోగ్యంతో తుదిశ్వాస విడవటం కలచివేస్తోందని వందకు పైగా చిత్రాలకు దర్శకుడిగా, ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఆయన అందించారని  కోడి రామకృష్ణతో కలసి మంగమ్మగారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మామయ్య, ముద్దుల మేనల్లుడు, భారతంలో బాలచంద్రుడు, మువ్వగోపాలుడు, బాలగోపాలుడు చిత్రాలకు పని చేశానని బాలకృష్ణ చెప్పారు. గొప్ప దర్శకుడిని కోల్పోవడం సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. 

అలీ :
అలాగే ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మృతిపై హాస్యనటుడు అలీ సంతాపం వ్యక్తం చేశాడు. ఒక క్యారెక్టర్ ని ఎలివేట్ చేయాలంటే కోడి రామకృష్ణ తర్వాతే ఎవరైనా అని, ఎందుకంటే, ఆయన వద్ద ఒక సినిమాలో నటిస్తే చాలని ఆ నటుడికి ఎంతో పేరొస్తుందని అన్నారు. కోడి రామకృష్ణ మన మధ్య లేరన్న వార్త వింటుంటే చాలా బాధగా ఉందని అన్నారు. కోడి రామకృష్ణ సినిమాల్లో దాదాపు నలభై చిత్రాల్లో తాను నటించానని అన్నారు. అలీతో సరదాగా కార్యక్రమంలో తాను పాల్గొంటానని కోడి రామకృష్ణ చెప్పారు కానీ, ఆ అదృష్టం తమకు దక్కలేదని చెప్పారు. ఇండస్ట్రీకి ఓ గొప్ప దర్శకుడు దూరమయ్యారని, కోడిరామకృష్ణ కుటంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాని అలీ అన్నారు. 

ఎన్టీఆర్ :
తెలుగు సినిమా ఓ లెజెండ్ ను కోల్పోయిందని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. 

కల్యాణ్ రామ్ :
హీరో కల్యాణ్ రామ్ స్పందిస్తూ కోడి రామకృష్ణ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.

చంద్రబాబు :
కోడి రామకృష్ణ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేశారు. గ్రామీణ, కుటుంబ నేపథ్యంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారని కోడి రామకృష్ణ మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. ఈ సందర్భంగా కోడి రామకృష్ణ కుటుంబానికి తన సంతాపం వ్యక్తం చేశారు.

More Related Stories