English   

మోక్షజ్ఞ ఎంట్రీ మీద క్లారిటీ... నెక్స్ట్ బోయపాటితోనే నట !

balakrishna clarity about his son nandamuri mokshagna movie entry
2019-02-22 12:30:12

గత కొన్నేళ్లుగా బాలకృష్ణ సినీ వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు మోక్షజ్ఞ ఎంట్రీ జరగలేదు. అమెరికాలో నటనలో శిక్షణ తీసుకున్న మొక్షు క్రిష్ డైరెక్ట్ చేసిన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి సినిమాల పట్ల కాస్త అవగాహన తెచ్చుకున్నాడు. మోక్షజ్ఞని ఎవరు పరిచయం చేస్తారనే విషయంలో గతంలో క్రిష్, వినాయక్ వంటి దర్శకుల పేరు వినిపించాయి. కానీ అవేవీ పట్టాలు ఎక్కలేదు. తాజాగా మహానాయకుడు సినిమా ప్రమోహన్స్ లో ఉన్న బాలయ్యకు ఇదే ప్రశ్న ఎదురయ్యింది హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు వుండనుందనే ప్రశ్నకి ఆయన ఎప్పటిలానే దాటవేసే ప్రయత్నం చేశాడు. మోక్షజ్ఞ కోసం ఇంతవరకూ ఎలాంటి కథలను వినలేదనీ మంచి కథ దొరికితే చూడాలని వచ్చే ఏడాది మోక్షజ్ఞ హీరోగా తప్పకుండా ఓ సినిమా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక తన తదుపరి సినిమా బోయపాటి శ్రీనుతో ఉంటుందనీ, ఎన్నికల హడావిడి పూర్తయిన తరువాత సెట్స్ పైకి వెళతామని అన్నారు. అయితే ఈమద్య కాలంలో మోక్షజ్ఞ మీడియా ముందుకు వచ్చింది లేదు, అప్పుడెప్పుడో లెజండ్ సమయంలో సెట్స్ లో సందడి చేసిన ఫోటోలు తప్ప వేరేవి లేవు, గతంలో కొన్ని పిక్స్ లీకయ్యాయి. వాటిలో లావుగా ఉండడంతో బరువు తగ్గిన తర్వాత సినిమా ప్రారంభం అవుతుందని అంటున్నారు. చూద్దాం బాలయ్య ఈ సారయినా చెప్పినట్లుగా వచ్చే ఏడాదిలో కొడుకును పరిచయం చేస్తాడో లేదో ?

More Related Stories