English   

మళ్ళీ వార్తల్లోకి ఎక్కిన బిగ్ బాస్ జంట !

Bigg Boss couple Dhadi Balaji and Nithya comes up with another controversy
2019-02-22 20:19:59

తమిళ నటుడు దాడి బాలాజీ మీద ఆయన భార్య నిత్య మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలాజి అతని రెండవ భార్య నిత్య కొద్ది కాలం క్రితం మనస్పర్థల కారణంగా విడిపోయారు. అప్పట్లోనే వీరి వ్యవహారం కేసులు, కోర్టుల వరకూ వెళ్లింది. ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు, నిత్య తన కూతురితో మాధవరం, శాస్త్రి నగర్‌లో నివశిస్తోంది. కాగా దాడిబాలాజి, నిత్య ఇద్దరూ ఆ మధ్య జరిగిన తమిళ బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోలో పాల్గొన్నారు. అక్కడ కూడా వీరిద్దరూ ఘర్షణ పడడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మాధవరం పోలీస్‌స్టేషన్‌లో దాడి బాలాజీపై ఫిర్యాదు చేసింది. అందులో బాలాజీ తప్ప తాగి వచ్చి గొడవ చేస్తున్నాడని, జనవరి 21న తాగి వచ్చి ఇంటి కిటికీలు పగలగొట్టి గొడవ చేయడంతో పాటు ఫోన్‌ లో అసభ్యంగా తిట్టి, హత్య చేస్తానని బెదిరింపులకు దిగాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అదే విధంగా తమ వివాహ రద్దు కేసు కోర్టులో ఉండగానే ఇలా గొడవ చేయడం పట్ల అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

 

More Related Stories