English   

చంద్రబాబును హీరో చేయడమే మహానాయకుడు ఫలితాన్ని డిసైడ్ చేసిందా..

NTR-Mahanayakudu
2019-02-23 09:13:17

ముందు నుంచి ప్రేక్షకుల్లో వస్తున్న అనుమానాలు ఇవే. మహానాయకుడు సినిమాలో కచ్చితంగా చంద్రబాబు హీరో అవుతాడని.. అందులో ఎన్టీఆర్ ను సైతం వెనక్కి నెట్టి కేవలం బాబు పాత్రలు మాత్రమే హైలైట్ చేస్తారని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు విడుదలైన తర్వాత ఇదే నిజమని తేలింది. నిజంగానే మహానాయకుడులో చంద్రబాబునాయుడు నాయుడు క్యారెక్టర్ హైలైట్ అయిపోయి.. ఎన్టీఆర్ ను సైతం డమ్మీని చేసే స్థాయికి దిగజారిపోయింది. కేవలం చంద్రబాబు నాయుడు చెప్పడం వల్లే తెలుగుదేశం పార్టీ బతికిందని.. లేకపోతే 1984లో నాదెండ్ల భాస్కరరావు పొడిచిన వెన్నుపోటు బలైపోయేది అన్నట్లు సినిమాలో చూపించారు. ఎన్టీఆర్ కు నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచే సమయంలో చంద్రబాబు అనే వ్యక్తి లేకపోయి ఉంటే ఆనాడే తెలుగుదేశం పూర్తిగా భూస్థాపితం అయిపోయేదని.. కానీ అలా కాకుండా చంద్రబాబు ఒంటిచేతితో తన తెలివితేటలతో అడ్డుకున్నట్లు సినిమాలో చూపించారు. 

ఎమ్మెల్యేలను కాపాడడం దగ్గర్నుంచి వాళ్లను ఢిల్లీ చేర్చే వరకు మొత్తం బాబు మాత్రమే నడిపించినట్లు సినిమాలో చూపించారు. అయితే ఇది నేటి తరానికి కథ ఏంటో తెలియకపోయినా నాటి తరం వాళ్ళు మాత్రం ఇందులో కాస్త కల్పితం కూడా ఉంది అంటున్నారు. చంద్రబాబునాయుడు సినిమాలో చూపించినంత హీరో మాత్రం కాదు.. అలాగని ఆయనను విలన్ కూడా అనలేం అంటున్నారు వాళ్లు. కానీ సినిమాలో కేవలం నాదెండ్ల భాస్కరరావును మాత్రమే విలన్ గా చూపించడం మాత్రం చరిత్రను వక్రీకరించడమే అవుతుంది అంటున్నారు విశ్లేషకులు. చంద్రబాబు పాత్ర హైలైట్ చేయడానికి అక్కడక్కడా ఎన్టీఆర్ సైతం తగ్గించాలంటే బాబు ఇన్ ఫ్లుయెన్స్ ఈ సినిమాపై ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి చంద్రబాబు పాత్ర హైలైట్ అవుతుంది అనుకుంటే.. ఆయన పాత్ర హైలైట్ కావడం వల్లే మహానాయకుడికి అతి పెద్ద మైనస్ అయ్యింది అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి ఇది ఇలా ఉంటే రేపు రాంగోపాల్ వర్మ తెరకెక్కించే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎలా ఉండబోతుందో.

More Related Stories