English   

మహానాయకుడు కలెక్షన్స్ చాలా దారుణంగా ఉన్నాయిగా..

Mahanayakudu
2019-02-23 10:27:37

ముందుగా ఊహించినట్లే జరుగుతుంది. మహానాయకుడు సినిమాకు కూడా దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. కథానాయకుడు సినిమాకు దాదాపు 45 శాతం ఆక్యుపెన్సీ వచ్చింది. కానీ మహానాయకుడు విషయంలో అందులో సగం కూడా రాకపోవడం ఇప్పుడు దర్శక నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లను కూడా కంగారుపెడుతోంది. తొలిరోజు ఈ చిత్రానికి కేవలం 3 నుంచి 4 కోట్ల మధ్యలో వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఒకవేళ ఇది నిజం అయితే గత కొన్నేళ్లలో బాలకృష్ణ నటించిన ఏ సినిమా కూడా ఇంత దారుణమైన పరాజయాన్ని మూట గట్టుకొని ఉండదు. ఓవర్సీస్లో కథానాయకుడు సినిమాకు తొలి రోజు దాదాపు 4 లక్షల 85 వేల డాలర్లు వచ్చాయి. కానీ మహానాయకుడు సినిమా మాత్రం కేవలం 75 వేల డాలర్లతో సరిపెట్టుకుంది. 

దీన్ని బట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ ఎన్టీఆర్ లాంటి మహానాయకుడు జీవిత చరిత్ర తీసుకొని ఇంత దారుణమైన పరాజయం పాలైతే ఆయన ప్రతిష్టకు కూడా ఇది అప్రదిష్ట. కానీ జరగాల్సిన ఘోరం ఇప్పటికే జరిగిపోయింది. కథానాయకుడు సినిమాకు టాక్ బాగా వచ్చినా కూడా కలెక్షన్లు మాత్రం రాలేదు. ఆ సినిమా దాదాపు 50 కోట్లు డిస్ట్రిబ్యూటర్లను నిలువునా ముంచింది. మహానాయకుడు సినిమా ఉంది కదా కనీసం ఇదైనా గాడిన పడుతుందేమో అని అంచనాలు పెట్టుకున్న వాళ్ళ ఆశలు ఆవిరైపోయాయి. ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ చూసి డిస్ట్రిబ్యూటర్ గుండె బద్దలయిపోతోంది. కథానాయకుడు 50 కోట్లు ముంచేస్తే మహానాయకుడు ఆ నష్టాలను తీర్చకపోగా ఇంకా అదనపు నష్టాలు తీసుకొచ్చేలా కనిపిస్తుంది. మరి తండ్రి బయోపిక్ తీసుకొని రోడ్డున డిస్ట్రిబ్యూటర్లను బాలకృష్ణ ఎలా ఆదుకుంటాడో చూడాలి.

More Related Stories