English   

క్రిష్ తన కెరీర్లో సరిదిద్దుకోలేని తప్పు చేశాడా..

Krish
2019-02-23 04:09:04

ఏమో ఇప్పుడు అభిమానుల్లో ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. ఇంతకుముందు క్రిష్ దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే కచ్చితంగా బాగుంటుంది అనే నమ్మకం ఉండేది. కమర్షియల్ గా ఆ సినిమా ఎలా ఉన్నా కూడా ఒక మంచి సినిమా చేస్తాడు.. అద్భుతమైన ప్రయత్నం చేస్తాడు అని నమ్మకం ఉండేది. అలాంటి దర్శకుడి చేతిలో ఎన్టీఆర్ బయోపిక్ పెట్టేసరికి ఎక్కడ లేని అంచనాలు పెరిగిపోయాయి. సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయారు నందమూరి అభిమానులు. కథానాయకుడు విడుదలైన తర్వాత కూడా ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే సినిమాకు మంచి టాక్ వచ్చింది. దాంతో కచ్చితంగా బాలకృష్ణ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని క్రిష్ కూడా నిలబెట్టానని అనుకున్నాడు. కానీ ఊహించని విధంగా విధంగా కథానాయకుడు డిజాస్టర్ అయిపోయింది. ఇక ఆ తర్వాత మహానాయకుడు వంతు. కేవలం సినిమాలు మాత్రమే ఉన్న కథానాయకుడే ప్రేక్షకులకు నచ్చకపోతే పూర్తిగా రాజకీయాలు చుట్టూ ఉన్న మహానాయకుడు వాళ్లకు ఎలా నచ్చుతుంది. ఇప్పుడు ఇదే జరిగింది. మహానాయకుడు సినిమాకు కూడా యావరేజ్ టాక్ వచ్చింది. ఇక కలెక్షన్లు మరీ దారుణంగా ఉన్నాయి. అసలు బాలకృష్ణ సినిమాకు ఇంత దారుణంగా కలెక్షన్లు రావడం ఏంటి అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. 

ఇదిలా ఉంటే క్రిష్ ఈ చిత్రాన్ని ఒప్పుకొని చాలా పెద్ద తప్పు చేశాడని.. ఎన్టీఆర్ లాంటి మహా వ్యక్తి జీవితంలో ఉన్న వెలుగు మాత్రమే కాకుండా చీకటిని కూడా చూపించు ఉండుంటే కచ్చితంగా మహానాయకుడు సినిమా మరో స్థాయిలో ఉండేదని.. కానీ కేవలం వెలుగు వరకు మాత్రమే చూపించి చీకటిగా చేసేసరికి ప్రేక్షకులకు నచ్చడం లేదనే వాదన వినిపిస్తోంది. బాలకృష్ణకు నచ్చేలా ఈ చిత్రం తెరకెక్కించారు కానీ ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో దర్శకుడు క్రిష్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా నష్టాల పరంగా ఎన్టీఆర్ బయోపిక్ చరిత్ర తిరగరాస్తుంది. ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో కూడా తీసుకుని నష్టాలు ఎన్టీఆర్ బయోపిక్ తో బాలకృష్ణ తీసుకురాబోతున్నాడు. ఎవరు అవునన్నా కాదన్నా క్రిష్ ఈ అపప్రధను జీవితాంతం మోయాల్సిందే. అందుకే ఆయన కెరీర్లో తెలిసి చేసినా తెలియక చేసినా జరిగిన అత్యంత పెద్ద పొరపాటు పేరు ఎన్టీఆర్ బయోపిక్. మరి ఇప్పటి నుంచి క్రిష్ కెరీర్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

More Related Stories