English   

కోడి రామకృష్ణ నుదుటిమీద బ్యాండ్ ఎందుకు కట్టుకుంటాడు..

Kodi-Ramakrishna
2019-02-23 04:31:59

ఈ అనుమానం చాలామందిలో ఉంటుంది. ఎందుకంటే కోడి రామకృష్ణ నుదిటిమీద మీద బ్యాండ్ లేకుండా ఎప్పుడు బయటికి రాడు. ప్రెస్ మీట్లకు వచ్చినా కూడా ఆయన బ్యాండ్ కచ్చితంగా వేసుకుని వస్తాడు. కోడి రామకృష్ణ అంటే ఆ బ్యాండ్ ఆయనకు బ్రాండ్. అయితే ఎప్పుడు నుదిటి మీద ఆ కర్చీఫ్ కట్టుకోవడానికి కారణం వెనుక ఒక కథ ఉంది. కోడి రామకృష్ణ దర్శకుడుగా మారిన కొత్త రోజుల్లో ఆయన నుదుటికి ఎలాంటి బ్యాండ్ లేకుండానే దర్శకత్వం చేసేవాడు. తొలి సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య కూడా అలాగే పూర్తి చేశాడు. అయితే రెండో సినిమా కోసం ఆయన కేరళ కోవాలం బీచ్ సమీపంలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఎన్టీ రామారావు మేకప్ మెన్ మోకా రామారావు అటువైపుగా వచ్చాడట. 

ఎండలు మండిపోతున్న సమయంలో కోడి రామకృష్ణ ఎలాంటి రక్షణ లేకుండా షూటింగ్ చేస్తుంది చూసి.. ఏమయ్యా కోడి ఇలాగే ఎండకు మండిపోతూ షూటింగ్ చేయాలా.. తలకు కనీసం ఒక గుడ్డ పెట్టుకోవచ్చు కదా అంటూ అడిగాడట. అంతటితో ఆగకుండా తన దగ్గర ఉన్న కర్చీఫ్ తీసుకొని దాన్ని ఒక బ్యాండ్ లా చేసి కోడి రామకృష్ణ కట్టుకోమని ఇచ్చాడట. ఆ తర్వాత రోజు ఒక బ్యాండ్ గా మార్చుకోవడం అలవాటు చేసుకున్నాడు. కోడి రామకృష్ణ ఆ తర్వాత ఎప్పుడు దానిని విడిచి ఉండలేదు. కోడి రామకృష్ణ సినిమా అంటే ఎలా ఉంటుందో ఒక క్లారిటీ ఉన్నట్లే.. ఆయన పేరు గుర్తుకు రాగానే ఒక బ్యాండ్ కట్టుకున్న రూపం కూడా మన కళ్ల ముందు మెదులుతుంది. ఎందుకంటే అది కోడి రామకృష్ణ బ్రాండ్. ఇది బ్యాండ్ వెనుక ఉన్న కథ. దాంతో పాటు ఆయనకు భక్తి కూడా ఎక్కువే. అందుకే చేతి నిండుగా దారాలు కట్టుకుంటూ కనిపిస్తాడు. మొత్తానికి ఇప్పుడు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయన సినిమాలు మాత్రం ఎప్పుడూ మనతో మాట్లాడుతూనే ఉంటాయి.

More Related Stories