English   

చనిపోయిన హీరోతో సినిమా చేసిన వేదిక దర్శకుడు కోడి రామకృష్ణ..

Kodi-Ramakrishna
2019-02-23 12:05:12

చనిపోయిన వ్యక్తిని మళ్లీ బ్రతికించడం ఎవరివల్లా కాదు. ఒకసారి భౌతికంగా దూరమైన మనిషికి ప్రాణం పోయడం అనేది సాధ్యం కాదు. కానీ కోడి రామకృష్ణ మాత్రం అది చేసి చూపించాడు. సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండే ఈ దర్శకుడు.. పదేళ్ల కింద చనిపోయిన హీరోతో మూడేళ్ల కింద ఒక సినిమా చేశాడు. అసలు ఇది నమ్మడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. కానీ విజువల్ ఎఫెక్ట్స్ వాడుకోవడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరూ వాడుకోలేరు అంటూ కోడి రామకృష్ణ చాలాసార్లు నిరూపించారు. అసలు తెలుగు సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ అనే పదాన్ని పరిచయం చేసింది కోడి రామకృష్ణ. ఇప్పుడంటే రాజమౌళి లాంటి దర్శకులు విజువల్ ఎఫెక్ట్స్ తో ఆడుకుంటున్నారు.. కానీ ఒకప్పుడు కోడి రామకృష్ణ వీటితో చెడుగుడు ఆడుకున్నాడు. 

ఒకటి రెండూ కాదు 20 ఏళ్ల కింద అమ్మోరు వంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించాడు ఈ దర్శకుడు. ఇక 2016లో ఈయన తెరకెక్కించిన సినిమా నాగభరణం. ఇందులో కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్ అతిథి పాత్ర చేశారు. అయితే ఆయన 2009లోనే చనిపోయారు. కానీ ఆయన అభిమానుల కోసం మరోసారి ఆయనను తెరపై చూపించే ప్రయత్నం చేశాడు కోడి రామకృష్ణ. నాగాభరణం క్లైమాక్స్ లో విష్ణువర్ధన్ మళ్ళీ ప్రాణం పోసుకుని వస్తాడు. విజువల్ ఎఫెక్ట్స్ లో ఆయనను మళ్ళీ స్క్రీన్ పై చూపించాడు కోడి రామకృష్ణ. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా విష్ణువర్ధన్ అభిమానులు మాత్రం పండగ చేసుకున్నారు ఎప్పటికీ ఇక వెండితెరపై తమ హీరోను చూసుకోలేము అనుకున్న వాళ్ల ఆశ నెరవేరుస్తూ మరోసారి ప్రాణం లేని మనిషికి విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రాణంపోసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఘనత కోడి రామకృష్ణదే. ఇది మాత్రమే కాదు ఇంకా ఎన్నో అద్భుతాలకు ప్రాణం పోసాడు కోడి రామకృష్ణ. అందుకే విజువల్ మాంత్రికుడు అంటారు ఈయనని.

More Related Stories