English   

సూపర్ డీలక్స్ ట్రైలర్ టాక్ !

Super-Deluxe
2019-02-23 12:46:28

అక్కినేని కోడలు సమంత త‌మిళ‌నాట న‌టిస్తున్న సినిమా సూప‌ర్ డీల‌క్స్. త‌మిళంలో ‘మక్కల్ సెల్వన్’గా పిల‌వ‌బ‌డే విజ‌య్ సేతుప‌తి చేస్తున్న ప్ర‌యోగాత్మ‌క చిత్రం ఇది. త్యాగ‌రాజ కుమార్ రాజా తెర‌కెక్కిస్తున్న ఈ సినియా ట్రైల‌ర్ విడుద‌లైంది. త‌మిళ సినిమా ఇండ‌స్ట్రీలోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి ట్రైల‌ర్ చూసుండ‌రనే మాట వాడుతూ ఈ సినిమాని ప్ర‌మోట్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి ట్రాన్స్‌జెండ‌ర్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని ట్రైలర్ ద్వారా అర్ధమవుతోంది. ఈ పాత్ర పేరు శిల్ప కాగా, ఎక్కువ మేకప్ లేకుండా లేడీ గెటప్ లో ఈ మాస్ హీరో ఒదిగిపోయిన తీరు అందరినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

ఇక స‌మంత అక్కినేని పాత్ర కూడా ఆస‌క్తిక‌రంగా ఉంది, ట్రైల‌ర్లో క‌త్తి ప‌ట్టుకుని ఎవ‌ర్నో న‌రుకుతున్న‌ట్లు చూపించాడు ద‌ర్శ‌కుడు. అలాగే రమ్యకృష్ణ వేశ్య పాత్రలో కనిపిస్తున్నారు. ‘ఓ రోజు కొండ ప్రాంతంలో నడుచుకుని వెళ్తున్న వ్యక్తిని ఉన్నట్లుండి ఓ పులి వెంటాడితే ఎలా ఉంటుంది? పులి దగ్గరికి వచ్చే సరికి ఆ వ్యక్తి ఇంకా వేగంగా పరుగెత్తుతున్నాడు’ అంటూ ఓ వ్యక్తి పులి కథ చెబుతుండగా, వచ్చిన సన్నివేశాలు ఆసక్తి రేపుతున్నాయి. మొత్తంగా అయితే సూప‌ర్ డీల‌క్స్ ట్రైల‌ర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. రెండు నిమిషాల ట్రైల‌ర్లో క‌థ‌ ఏ మాత్రం అర్థం కాకుండా క‌ట్ చేసాడు ద‌ర్శ‌కుడు. ఫహద్‌ ఫాజిల్‌, సమంత, మిష్కిన్‌, రమ్యకృష్ణ, గాయత్రి, భగవతి పెరుమాల్‌ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. మార్చ్ 29న విడుద‌ల కానుంది ఈ సినిమా మీద అంచనాలు అయితే బానే ఉన్నాయి. ఏమేరకు హిట్ కొడుతుందో చూడాలి మరి.

More Related Stories