English   

హీరోగా ఎంట్రీ ఇస్తున్న రకుల్ సోదరుడు...రేపే ముహూర్తం !

aman
2019-02-23 13:27:59

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. దాసరి లారెన్స్ దర్శకత్వంలో రాజానే ఫిలిం కార్పోరేషన్ నిర్మాణంలో ఈ సినిమా రేపు ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ లో లాంచ్ జరుపుకోనుంది. గతకొంత కాలంగా టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు సినీరంగ ప్రవేశం చేయనున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనికి కారణం టాలీవుడ్, కోలీవుడ్లలో వరుస సినిమాలతో బిజీగా వున్న రకుల్ ప్రీత్ సింగ్ రెండేళ్ళ క్రితం తన సోదరుడు అమన్ కి శుభాకాంక్షలు చెబుతూ ఓ ట్వీట్ చేశారు. షార్ట్ ఫిలిం ద్వారా యాక్టింగ్ మొదలుపెట్టిన అమల్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఇది కేవలం ఆరంభం మాత్రమే అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. చందు హుగ్గిహెళ్ల అనే ఆయన డైరెక్ట్ చేసిన రాక్ అండ్ రోల్ అనే షార్ట్ ఫిలింలో అమన్ నటించాడు. ఏ స్టోరీ ఆఫ్ సెక్స్, గన్స్ అండ్ ఏ బంచ్ ఆఫ్ ఇడియట్స్' అనే క్యాప్షన్ తో ఈ షార్ట్ ఫిలిం రిలీజ్ అయ్యింది. మంచి బాడీ ఫిట్ నెస్ కలిగిన అమన్ తన సినీరంగ ప్రవేశానికి ఈ షార్ట్ ఫిలింని ఓ మెట్టుగా వాడుకుంటున్నాడు. అయితే మరి తెలుగు తెరకు పరిచయం కాబోతున్న అమన్, ప్రాచీ తేలన్ ఎంతవరకు నిలదొక్కుకుంటారో చూడాల్సిందే మరి.

More Related Stories