English   

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూడొద్దు తమ్ముళ్ళూ.. టిడిపికి బాబు పిలుపు..

Lakshmis-NTR
2019-02-23 07:24:29

ఓ సినిమా చూసి నిజంగానే ప్రేక్షకులు మారిపోతారా.. ఓ వ్యక్తిపై అభిప్రాయాన్ని మార్చుకుంటారా.. ఖచ్చితంగా కాదు. కానీ కొన్ని సార్లు అదే అవును అనిపిస్తుంది. కూడా పైగా ఎన్నికల సమయం.. రాజకీయ నాయకులు అసలు రిస్క్ తీసుకోరు. ఇప్పుడు చంద్రబాబునాయుడు విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈయన హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ వచ్చింది. మహానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ ను సైతం వెనకాల పెట్టి మొత్తం చంద్రబాబే ముందుండి నడిపించినట్టు చూపించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది. ఈ సారి చంద్రబాబుకు భజన చేసే సినిమా కాదు.. బ్యాండ్ బాజాయించే సినిమా. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఇప్పుడు చంద్రబాబు నాయుడుని నిజంగానే టెన్షన్ పెడుతోంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు కానీ విడుదలైన తర్వాత మాత్రం కచ్చితంగా సంచలనం సృష్టిస్తుందని ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతుంది.

సినిమా మేకింగ్ లో క్వాలిటీ లేకపోయినా కూడా కంటెంట్లో క్వాలిటీ పెట్టుకొని వస్తున్నాడు వర్మ.  దాంతో చంద్రబాబు నాయుడు కూడా అలర్ట్ అవుతున్నాడు. వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను మన పార్టీ నేతలు ఎవరూ చూడవద్దు అంటూ  ఒక మీటింగ్లో  చంద్రబాబు నాయుడు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ వార్తలు బయటకు రాకపోయినా కూడా ఇప్పుడు టిడిపిలో జరుగుతున్న  కొన్ని పరిస్థితుల దృష్ట్యా నిజంగానే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను చంద్రబాబు కార్యకర్తలకు ఆదేశించినట్లు తెలుస్తోంది.  ఒకవేళ ఇదే నిజమైతే  చంద్రబాబు నాయుడు ఒకింత భయపడినట్లే.  ఎన్నికల సమీపిస్తున్న వేళ వర్మతో లేనిపోని గొడవ ఏలా అనుకుంటున్నాడు చంద్రబాబునాయుడు. అందుకే తానే ఒక మెట్టు తగ్గితే తప్పేం లేదు అన్నట్లు సైలెంట్ గా ఉన్నాడు ఈ నాయకుడు. ట్రైలర్లో తనను విలన్ గా చూపించిన కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు చంద్రబాబునాయుడు. మరి రేపు సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

More Related Stories