English   

మహేష్ భలే తెలివైన పని చేశాడే ?

AMB-Cinemas
2019-02-23 15:21:55

ఏఎంబీ సినిమాస్ లో సినిమా ప్రేక్షకుల నుంచి జీఎస్టీ పేరుతో అదనంగా వసూలు చేసిన రూ.35.66 లక్షలను ధియేటర్ యజమాని మహేష్ బాబు ‘వినియోగదారుల సంక్షేమనిధి’కి విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ విషయాన్ని ముందుగా జీఎస్టీ అధికారులు నోటీసులు ఇచ్చినప్పుడు జనాలు చాలా మంది మహేష్ బాబుని తిట్టారు, ఇన్ని కోట్లు సంపాదించినా ఇంకా ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తున్నాడా ? అని. అయితే తాజాగా మహేష్‌ బాబు తమది కాని లాభాన్ని గుర్తించి తిరిగి చెల్లించినందుకు  జీఎస్‌టీ హైదరాబాద్‌ కమిషనరేట్‌ వారిని అభినందిస్తూ ప్రకటన విడుదల  చేసింది. దేశవ్యాప్తంగా ఎవరూ ఇలా బాధ్యతగా జీఎస్టీని వెనక్కు తిరిగి ఇవ్వలేదని మహేష్‌ బాబు, సునీల్‌ నారంగ్ లు అందరికీ ఆదర్శంగా నిలిచారని కమిషనరేట్‌ తెలిపింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూరుల్లోని థియేటర్ల యజమానులు కూడా ఇదే విధంగా తిరిగి చెల్లిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలా మొన్న తిట్టిన నోళ్లె ఇప్పుడు మన సూపర్ స్టార్ ఏ విషయంలోనైనా సూపర్ స్టారే అంటూ పోగుడుతున్నాయి. అయితే జనానికి అర్ధం కాని లాజిక్ ఏంటంటే మహేష్ చెల్లించిన ఈ డబ్బు విరాళం ఎలా అవుతుంది? నిజానికి అది జనం సొమ్ము తగ్గించిన జీఎస్టీ అమలు చేయకుండా పాత స్లాబ్ లోనే టిక్కెట్లు అమ్మి ముప్పై ఐదు లక్షలకి పైగా కూడబెట్టారు, ఇప్పుడు మీడియాలో కాస్త హైలైట్ కావడంతో  జనానికి రిటర్న్ ఇవ్వడం కుదరని పని కాబట్టి ఇలా వినియోగదారుల సంక్షేమ నిధికి విరాళం ఇచ్చేశారు.

More Related Stories