English   

వేలానికి శ్రీ దేవి చీర !

Sridevi
2019-02-23 17:50:56

తన అందం, అభినయంతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న శ్రీదేవి కిందటేడాది ఆకస్మిక మరణానికి గురయ్యారు. తమ బంధువుల వివాహ వేడుక నిమిత్తం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడే ఫిబ్రవరి 24వ తేదీ రాత్రి హోటల్‌ గదిలో తుదిశ్వాస విడిచారు. బాత్‌ రూంలో ఉన్నప్పుడు గుండెపోటు రావడంతో బాత్ టబ్బులో కుప్పకూలిపోయారని, అందులోనే ప్రాణాలు విడిచారని దుబాయ్ అధికారులు ధ్రువీకరించారు. ఆమె చనిపోయి రేపటికి సంవత్సరం పూర్తవుతున్న నేపధ్యంలో శ్రీదేవి తొలి వర్థంతిని ఘనంగా చేసేందుకు బోనీ కపూర్ కుటుంబం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆరోజున పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టబోతోంది. దీనిలో భాగంగా శ్రీదేవికి ఎంతో ఇష్టమైన చీరను వేలం వేసి వచ్చిన డబ్బును సేవా కార్యక్రమానికి ఉపయోగించాలని ఆమె కుటుంబం నిర్ణయించిందట. ఈ నేపధ్యంలోనే శ్రీ దేవికి ఎంతో ఇష్టమైన ‘కోటా’ చీరను ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టారు. పరిసెర అనే లగ్జరీ ఆన్‌ లైన్ షాప్‌ లో ఈ చీరపై బిడ్‌లను ఆహ్వానిస్తున్నారు. కనీస బిడ్ ధరను రూ.40 వేలుగా నిర్ణయించారు. ఈ చీర కోసం ఎవరైనా బిడ్ వేయొచ్చు కానీ వేలం ముగిసే సమయానికి ఎక్కువ బిడ్ ఎవరు వేస్తే వారికి ఈ చీర దక్కుతుందని పరిసెర వారు చేబుతున్నారు. వేలంలో వచ్చిన డబ్బును ‘కన్సెర్న్ ఇండియా ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా అందజేయనున్నారని సమాచారం. 

More Related Stories