English   

విశ్వాసం తెలుగు ట్రైలర్ టాక్ !

Viswasam
2019-02-23 20:52:57

తమిళ స్టార్ హీరో అజిత్, నయనతార జంటగా నటించిన ''విశ్వాసం'' సినిమా తమిళ వర్షన్ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై దుమ్మురేపింది. అక్కడ అంచనాలకు మించి సినిమా ఆడడంతో ప్రస్తుతం ఈ సినిమా తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాని సత్యజ్యోతి ఫిలింస్‌ అసోషియేషన్‌తో ఎన్‌.ఎన్‌.ఆర్‌ ఫిలింస్‌ బ్యానర్ మీద ఆర్‌.నాగేశ్వరరావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. మార్చి 1న రిలీజ్ కానున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని నిర్మాతలు చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్ తెలుగు ప్రేక్షకులకి సినిమా మీద ఆసక్తి రేకెత్తించే విధంగా ఉంది. వీర‌మ్, వేదాలం, వివేగం సినిమాల త‌ర్వాత అజిత్ - శివ కాంబినేష‌న్‌లో వచ్చిన నాలుగో సినిమా కావడంతో అంచనాలు మరింతగా ఉన్నాయి. సంక్రాంతికి రజనీ పేటకు పోటీగా వచ్చి దాదాపు 130 కోట్లు వసూలు చేసింది విశ్వాసం. ట్రైలర్ ని  పరిశీలిస్తే ప‌క్కా విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో శివ తెరకెక్కించిన సినిమా అనే విషయాన్ని. హైలైట్ చేసాడు ద‌ర్శ‌కుడు. నయనతార హీరోయిన్ కావడం, తెలుగువారికి సుపరిచితమైన తెలుగు నటుడు జగపతిబాబు కీలక పాత్ర పోషించడం తో తెలుగులో కూడా మంచి వసూళ్లు తీసుకొస్తుందని విశ్వాసంతో ఉన్నారు విశ్వాసం నిర్మాతలు. మరి వాళ్ల విశ్వాసాన్ని ఈ విశ్వాసం ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి. తెలుగు వారిని అలరిస్తున్న ఈ ట్రైలర్ ని మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
 

More Related Stories