English   

నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ !

Robbery in Mohan Babu House
2019-02-23 22:33:21

సెలెబ్రిటీల ఇళ్లలోని వస్తువులు దొంగతనాలు కావడం ఇటీవల కాలంలో కామన్ గా మారిపోయింది. తెలిసిన వ్యక్తులో లేదంటే ఇంట్లో పనిచేసే వ్యక్తులో ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. ఆ మధ్య మెగాస్టార్ ఇంట్లో పని చేసేవారే దొంగతనానికి పాల్పడగా, తాజాగా భానుమతి ఇంట్లో కూడా అదే రిపీట్ అయ్యింది. ఇక ఇప్పుడు మోహన్ బాబు వంతు వచ్చింది. తాజాగా మోహన్‌ బాబు ఇంట్లో చోరి జరిగింది. ఈ మేరకు ఆయన మేనేజర్‌ చంటి బంజారా హిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. లక్ష రూపాయల నగదు, బంగారు ఆభరణాలు చోరికి గురైనట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. పనిమనిషి మీదే అనుమానులున్నట్టుగా ఆయన ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఇంట్లో పనిచేసే పనిమనుషులను విచారిస్తున్నారు పోలీసులు. దొంగలు ఎవరు అనే విషయాన్ని త్వరలోనే తేలుస్తామని అంటున్నారు పోలీసులు.  

More Related Stories