English   

నాని బర్త్ డే ఫస్ట్ లుక్ పోస్టర్స్ అదిరిపోయాయిగా..

Jersey Movie Nani Birthday Wishes Posters out
2019-02-24 07:51:52

ఫిబ్రవరి 24 న్యాచురల్ స్టార్ నాని బర్త్ డే. దాంతో దర్శక నిర్మాతలు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు కొత్త పోస్టర్లు విడుదల చేశారు దర్శక నిర్మాతలు. నాని ప్రస్తుతం జెర్సీ సినిమాతో బిజీగా ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమాతో పాటు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో కూడా మరో సినిమాకు కమిట్ అయ్యాడు నాచురల్ స్టార్ నాని. ఈ చిత్ర ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. టైటిల్ తో సహా ఫస్ట్ లుక్ సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

దీనికి గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు నిహారిక మూవీస్ కూడా నాని బర్త్ డే పోస్టర్ విడుదల చేసింది. త్వరలోనే ఈయన ఆ నిర్మాణ సంస్థలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. వీటితో పాటు మరో రెండు నిర్మాణ సంస్థలు కూడా నాని బర్త్ డే పోస్టర్లు విడుదల చేశాయి. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత జరుపుకుంటున్న మొదటి బర్త్ డే ఇది. దాంతో చాలా గర్వంగా ఉందంటున్నాడు న్యాచురల్ స్టార్. ఎలాంటి సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా ఎదగడం అంటే చిన్న విషయం కాదు. నాని అది చేసి చూపించాడు నాచురల్ స్టార్. గత కొన్ని దశాబ్దాలలో చిరంజీవి, రవితేజ తర్వాత నాని స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత ఇప్పుడు విజయ్ దేవరకొండ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సంచలనాలు సృష్టిస్తున్నాడు.

More Related Stories