English   

తెలుగుదేశంతోనే కమెడియన్ అలీ.. చంద్రబాబు క్లారిటీ..

chandrababu naidu clarity about comedian ali in tdp
2019-02-24 01:24:58

ఇప్పటివరకు సినిమాలతో అలరించిన కమెడియన్ అలీ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నాడు. ఈయన కొంత కాలంగా రాజకీయాల్లోనే ఉన్నాడు కూడా. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాత్రం ఎప్పుడూ రాలేదు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని కాదని జగన్ వైసీపీ, తెలుగుదేశం పార్టీల వైపు అడిగేస్తున్నాడు కమెడియన్ అలీ. మొన్నటి వరకు జగన్ తోనే కలిసిపోతారని అనుకున్నారు కానీ అక్కడ ఆయనకు సీటు నిరాకరించడంతో ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం వైపు వచ్చాడు ఈ నటుడు. తాజాగా విజయవాడలో ఇండస్ట్రీలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సన్మాన కార్యక్రమం జరిగింది. దానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా వచ్చారు. అక్కడే కమెడియన్ అలీ గురించి మాట్లాడాడు.

ఇలాంటి మంచి వ్యక్తులు రాజకీయాల్లో కూడా ఉండాలని కోరుకున్నాడు బాబు. అక్కడితో ఆగకుండా తెలుగుదేశం ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చాడు. దీన్ని బట్టి త్వరలోనే అలీ మళ్లీ తెలుగుదేశంతో కలిసి పని చేస్తారని అర్థమవుతుంది. తనకు ఎమ్మెల్యేతో పాటు మంత్రి పదవి కూడా కావాలని కోరుకుంటున్నారు కమెడియన్ అలీ. ఇవ్వకపోతే తనకు ఏ పార్టీ అయినా ఒక్కటే.. మంత్రి పదవి రానప్పుడు ఆ పార్టీలో నేను పని చేయను అని ఇంతకు ముందే చెప్పాడు ఈయన. ఇది తెలిసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు అలీకి సపోర్ట్ చేస్తున్నాడు అంటే మంత్రి పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లే. అయితే దానికి ముందు ఎమ్మెల్యేగా పోటీ చేయాలి.. అక్కడి నుంచి ఆయన గెలిచి చూపించాలి.. ఆ తర్వాత ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా.. మరి ఈ కమెడియన్ అంత దూరం వెళ్తాడో లేదో చూడాలి.

More Related Stories