English   

ఫ్లాప్ డైరెక్టర్ కి డేట్స్ ఇచ్చిన శర్వా !

Chandoo Mondeti to team up with Sharwanand
2019-02-24 08:51:05

ఫ్లాపులు ఇచ్చిన దర్శకుల్ని అక్కున చేర్చుకోవడంలో మన తెలుగు హీరోలు కాస్త ముందే ఉంటారు. వాఆరిలో ముందు వరుసలో కనిపిస్తున్నాడు శర్వానంద్. మొన్నటికిమొన్న హను రాఘవపూడికి పిలిచి మరీ అవకాశం ఇచ్చి పడిపడి లేచే మనసు తీసిన శర్వా ఇప్పుడు చందు మొండేటికి ఛాన్స్ ఇస్తున్నాడు. అతి త్వరలో చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు శర్వానంద్. ఈ మేరకు చర్చలు కూడా పూర్తయి స్టోరీ లాక్ అయిందని సమాచారం. ప్రస్తుతం శర్వా 96 రీమేక్ చేస్తున్నాడు, ఆ సినిమా పూర్తయ్యాక ఈ సినిమా సెట్స్ మీదకు వస్తుందని అంటున్నారు. అయితే  రీసెంట్ గా సవ్యసాచి సినిమాతో ఫ్లాప్ ఇచ్చాడు చందు మొండేటి. కార్తికేయ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన చందూకి ఆ సినిమా ఒక్కటే మిగిలింది బాగా ఆడిందని చెప్పుకోడానికి, ఆ తర్వాత చేసిన ప్రేమమ్ తాజాగా చేసిన సవ్యసాచి కూడా నిరాశే మిగిల్చింది. అయితే వీరి సినిమా మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
 

More Related Stories