English   

లక్ష్మీస్ ఎన్టీఆర్ వీడియో సాంగ్ రిలీజ్...బాబే విలనా ?

nee uniki video song from lakshmis ntr
2019-02-24 04:55:18

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ను ఇప్పటికే రిలీజ్ చేసిన వర్మ అభిమానులు, ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతూ వస్తున్నారు. రిలేజ్ త్వరగా చేయాలనీ అనుకుంటున్నారో ఏమో గానీ జోరుగా ప్ర‌మోష‌న్ మాత్రం చేస్తున్నారు. తాజాగా సినిమాలోని తొలి వీడియో సాంగ్ విడుద‌ల చేశారు. నీ ఉనికి అంటూ సాగే పాట‌ని బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆల‌పించ‌గా, సిరాశ్రీ లిరిక్స్ వ్రాశారు. క‌ళ్యాణ్ మాలిక్ బాణీలు స‌మ‌కూర్చారు. ఈ వీడియో సాంగ్ లో ల‌క్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఇంట్లోకి అడుగుపెట్ట‌డం ఆ త‌ర్వాత ఆయ‌న జీవితంలోకి రావ‌డం వంటి స‌న్నివేశాల‌ని చూపించారు. నిజానికి వర్మ సిరీస్ వలన తెలుగు ప్రేక్షకులలో\ చాలా కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను టిడిపి కార్యకర్తలు దొంగచాటున అయినా సరే చూడాలనిపించే టట్లు ప్రోమోలు, సాంగ్స్ రిలీజ్ చేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ.

 

అసలు ఎన్టీఆర్ పతనానికి కారణం చంద్రబాబు వెన్నుపోటు అనేట్టుగా వర్మ వీదియలను బట్టి అర్ధం అవుతోంది. నిజానికి అసలు లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ ల మధ్య ఉన్న రిలేషన్ ఎలాంటిదో బయట చాలా మందికి తెలియదు. కానీ రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో లక్ష్మీ పార్వతిని చూసి ఎన్టీఆర్ సొల్లు కార్చుకోవడం అనే విధంగానే చూపిస్తున్నాడు. ఇది ఎన్టీఆర్ ఇమేజ్ ని దీగ్రేడ్ చేసేట్టుగా ఉంది, మరి ఎన్టీఆర్ అభిమానిని అని చెప్పుకుంటున్న వర్మ ఈ సినిమాని ఎలా చూపనున్నాడు అనేది అర్ధం కావడం లేదు. ఈ సినిమాలో కన్నదనటి యజ్ఞాశెట్టి ‘లక్ష్మీపార్వతి’ పాత్రలో నటిస్తోండ‌గా, ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు న‌టిస్తున్నాడు . ఇక చంద్రబాబు పాత్రలో వంగవీటి సినిమాలో దేవినేని నెహ్రూగా నటించిన శ్రీతేజ్ నటిస్తున్నారు. వర్మ ఏమి చేయనున్నాడో సినిమా రిలీజ్ అయితే కానీ చెప్పలేం.

More Related Stories