English   

హాస్పిటల్ బెడ్ మీద దీన స్థితిలో ఉన్న ఒకప్పటి స్టార్ హీరోయిన్..

vijayalakshmi admitted to hospital in bangalore
2019-02-24 12:35:05

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చినప్పుడు డబ్బులు కూడా దాచి పెట్టుకోవాలి. ఇక్కడ ఎవరి జాతకం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. అందుకే అవకాశం వచ్చినప్పుడే నాలుగురాళ్లు వెనకేసుకోవాలంటారు. ఇప్పటి తరం హీరోయిన్లు ఈ విషయంలో చాలా ఫాస్ట్. పట్టుమని పది సినిమాలు చేసినా కూడా లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. సంపాదించినప్పుడే ఏదో ఒక వ్యాపారంలో కానీ లేదంటే మిగిలిన విషయాల్లో కానీ ఆదా చేసుకుంటున్నారు. కానీ ఒకప్పటి హీరోయిన్ లకు అంత జాగ్రత్తలు తెలియదు. తాజాగా మరో హీరోయిన్ కూడా ఇలాంటి దుస్థితి వచ్చింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాల్లో నటించిన విజయలక్ష్మి ఇప్పుడు హాస్పటల్ లో ఉంది.

హనుమాన్ జంక్షన్ సినిమాలో జగపతి బాబు తల్లిగా నటించిన ఈమె. ఆ తర్వాత కూడా కొన్ని తెలుగు సినిమాల్లో కనిపించింది విజయలక్ష్మి. కన్నడలో చాలా సినిమాలతో పాటు సీరియల్స్ కూడా చేసింది ఈమె. కొన్ని రోజుల కింద షుగర్ లెవల్స్ మరీ ఎక్కువ కావడంతో హాస్పిటల్లో జాయిన్ అయింది. అయితే బిల్లు కట్టడానికి కూడా చిల్లిగవ్వ లేకపోవడంతో ఇప్పుడు ఆమె సోదరి అభిమానులను ఆర్థిక సాయం కోసం అభ్యర్థిస్తుంది. ఒకప్పుడు మంచి స్థితిలో ఉన్న కూడా ఇలాంటి దీనస్థితికి రావడంతో ఆమె పరిస్థితిని చూసి అభిమానులు కూడా జాలి పడుతున్నారు. ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తున్నారు. ప్రస్తుతం విజయలక్ష్మి పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్లు చెబుతున్నారు వైద్యులు. ఆమె ఐసీయూలో ఉందిప్పుడు. బెంగళూరులోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది విజయలక్ష్మి. మరి ఆమె త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం.

More Related Stories