English   

ఒకే వేదిక మీద బాబాయ్-అబ్బాయ్...బయోపిక్ మీద స్పందన ?

Balakrishna, Jr NTR to attend 118 Movie pre-release event
2019-02-24 09:35:27

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, కె.వి.గుహన్ దర్శకత్వంలో తారక్ కళ్యాన్ రామ్ ల పీఆర్వో మహేష్ కోనేరు నిర్మాతగా 118 సినిమా విడుదలకి సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి కళ్యాణ్ రామ్ కెరీర్లో డిఫరెంట్ మూవీ గా ఉండబోతుందని టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా చూసిన దిల్ రాజు రెండు రాష్ట్రాలలో ఈ సినిమా తానే రిలీజ్ చేస్తున్నాడు, దీంతో సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. మరోపక్క పటాస్ తర్వాత సరయిన హిట్ పడని కళ్యాన్ రామ్ కూడా సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇందులో శాలిని పాండే, నివేతా థామస్ కళ్యాణ్ రామ్ కి జోడీగా నటిస్తున్నారు. అయితే ఈ రేపు సాయంత్రం 118 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి ప్లాన్ చేసారు నిర్మాత. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ లుగా జూనియర్ ఎన్టీఆర్ తో పాటు నందమూరి బాలకృష్ణ కూడా వస్తూ ఉండడం ఇప్పుడు నందమూరి అభిమానుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతోంది. హరికృష్ణ మరణం తర్వాత ఒకటైన బాబాయ్ అబ్బాయిలు, మరోసారి ఒకే వేదిక పంచుకోవడంతో అభిమానులు ఈ వేడుక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంతో టాలీవుడ్ లో మరల కొద్ది రోజులుగా బాలకృష్ణ ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందా ? అనే వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాబాయ్ అబ్బాయిలు కలయిక నందమూరి ఫ్యాన్స్ కి కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బహుసా తారక్ ఈ వేడుక సందర్భంగా అయినా తన స్పందన తెలియచేస్తాడని భావిస్తున్నారు.

More Related Stories