English   

గ్యాంగ్ లీడర్ గా మారిపోయిన న్యాచుర‌ల్ స్టార్ నాని..

nani as a gang leader
2019-02-24 12:48:53

న్యాచుర‌ల్ స్టార్‌ నాని, విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడు విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాకు గ్యాంగ్ లీడ‌ర్ అనే టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసారు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌(సివిఎం) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ప్ర‌క‌టించారు నిర్మాతలు. చిరంజీవి ఆల్ టైమ్ క్లాసిక్ టైటిల్ అని తెలిసినా.. ఏదైనా తేడా జ‌రిగితే అస‌లుకే మోసం వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని తెలిసినా కూడా ధైర్యం చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఆగ‌స్ట్ లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైన త‌ర్వాత చాలా త‌క్కువ బ్రేక్స్ మ‌ధ్య ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు విక్ర‌మ్ కే కుమార్. ముఖ్యంగా ఐదుగురు లేడీస్ మ‌ధ్య ఈ క‌థ సాగుతుంది.
ఈ సినిమాలో నానితో పాటు కార్తికేయ, ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్‌ రవిచందర్ అందిస్తున్నాడు. జెర్సీ సినిమా త‌ర్వాత మ‌రోసారి నాని సినిమాకు ప‌ని చేస్తున్నాడు అనిరుధ్. ఇక ఈ సినిమాకు విదేశీ సినిమాటోగ్రఫ‌ర్ మిరోస్లా కుబా బ్రోజెక్ ప‌ని చేస్తున్నాడు. మ‌రోసారి ఈ చిత్రంతో త‌న స‌త్తా చూపించాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు విక్రమ్ కే కుమార్. స్క్రీన్ ప్లే మార్క్ చూపించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. హ‌లో, 24 సినిమాలు అనుకున్న స్థాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో నిరాశలో ఉన్నాడు విక్ర‌మ్. మ‌రి నాని సినిమాతో ఏం మాయ చేస్తాడో చూడాలిక‌.

More Related Stories