English   

మహర్షి రీ షూట్ కి వెళుతున్నాడా ?

Mahesh Babu Maharshi movie is reshoot
2019-02-24 13:12:26

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న మహర్షి సినిమాని ఏప్రిల్‌ 25 విడుదల చేయాలని చాలా రోజుల క్రితమే దిల్ రాజు ప్రకటన చేశారు. అయితే అనుకున్నట్టు ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కావడం లేదని అంటున్నారు. దానికి కారణం మహేష్ బాబే నట. ఈ సినిమా ఔట్‌పుట్ మీద మహేష్ బాబు అసంతృప్తిగా ఉన్నారని, అందుకే ఈ చిత్రంలోని కొన్ని సీన్లు రీ షూట్ చేయాలని భావించి నట్టు సమాచారం. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో మైలు రాయి లాంటి 25వ కావడం, మహేష్ బాబు గత చిత్రం భరత్ అనే నేను బాక్సాఫీసు వద్ద సంచలన విజయం నమోదు చేయడంతో అలాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద మహేష్ బాబు స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. సినిమాలో కొన్ని చోట్ల ఎమోషన్స్ సరిగా పండలేదని భావిస్తున్న మహేష్ రీ షూట్ కి వెళ్ళాలని భావిస్తున్నట్టు ఇన్సైడ్ సమాచారం. అయితే విషయాన్ని అర్ధం చేసుకున్న నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజు కూడా రీషూట్ కి ఓకే చెప్పినట్లు సమాచారం. రీ షూట్స్ సకాలంలో పూర్తయితే ఈ సినిమాను జూన్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

More Related Stories