English   

చిక్కుల్లో బాలీవుడ్ హీరోయిన్ !

Fraud case filed against On Bollywood actor Sonakshi Sinha
2019-02-24 13:46:24

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా చిక్కుల్లో పడింది. ఒప్పుకున్న ఒక ఈవెంట్ కు వెళ్ళకుండా ఎగగోట్టినందుకుగాను ఆమెకి లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. అందుతున్న సమాచారం  ప్రకారం మొరాదాబాద్ లో ఒక ఫాషన్ కంపెనీ నడుపుతున్న ప్రమోద్ శర్మ గతేడాది నవంబర్ 24 వ తేదీన ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి దానికి సోనాక్షి సిన్హా వచ్చేలా, అందులో ఆమె పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి గాను ముప్పై ఏడు లక్షలకు డీల్ మాట్లాడుకున్నారు, ఆ డబ్బు కూడా ఆమె ముందు గానే అందుకున్నారు. కానీ ఆమె చివరి నిముషంలో హ్యాండ్ ఇచ్చిందని అందువలన తాను నష్టపోవాల్సి వచ్చిందని ప్రమోద్ శర్మ కోర్టుకు ఎక్కాడు, అంతే కాక ఆమె బస తదితరాల కోసం మరో తొమ్మిది లక్షలు ఖర్చయ్యయని వాటిని తిరిగి ఇప్పించాల్సినిందిగా కోరుతూ ఆయన కోర్టు మెట్లు ఎక్కాడు. దీంతో కోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం సోనక్షి దబాంగ్ 3 సినిమా షూట్ మొదలు పెట్టాల్సి ఉంది. ఈ నోటీసుల విషయం మీద ఆమె గానీ ఆమె టీం గానీ స్పందించలేదు.

More Related Stories