English   

వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్ !

Lakshmi's NTR Pre-Release Business create Record Price
2019-02-24 21:54:04

ఆఫీసర్ సినిమా రిజల్ట్ చూసాక వర్మ పస అయిపోయిందని అనుకున్నారు. అయితే ఆయన చాలా రోజుల తరువాత లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. రక్త చరిత్ర తరువాత వర్మ ఎన్నో సినిమాలు చేసినా ఆ సినిమాల కంటే రక్త చరిత్ర రేంజ్ లో బజ్ క్రియేట్ అయ్యింది మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ కే అని చెప్పకతప్పదు. అందుకే తెలుగు ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతోందని సమాచారం. సినిమా ఫస్ట్ కాపీ చూసిన శివం సెల్యులాయిడ్ సంస్థ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా వరల్డ్ వైడ్ థియేటర్ హక్కులను కొనేశారని ఫిలిం నగర్ టాక్. లక్ష్మీస్ ఎన్టీఆర్ బిజినెస్ మొత్తం 13 కోట్లు జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ కేవలం రెండు కోట్లు మాత్రమేనట, అంతేకాక ఈ సినిమా బిజినెస్ తో పాటు డిజిటల్ శాటిలైట్ రైట్స్ కూడా అనుకున్నదానికంటే ఎక్కువగా వెళ్లినట్లు తెలుస్తోంది. సినిమా ట్రైలర్ ని బట్టి తక్కువ బడ్జెట్ లోనే సినిమాను పూర్తి చేశారనిపిస్తుంది. కానీ బిజినెస్ మాత్రం అన్ని విధాల చూసుకుంటే 22 కోట్లు బిజినెస్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మార్చి 15న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నాడు రాంగోపాల్ వర్మ.

More Related Stories