English   

క్షమించండి.. తప్పైపోయింది అంటున్న స్టార్ కమెడియన్..

Rahul Ramakrishna apologises for Prashant Kumar's 'Mithai' movie
2019-02-24 15:28:02

రాహుల్ రామకృష్ణ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో సూపర్ పాపులర్ అయిపోయాడు రాహుల్ రామకృష్ణ. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమాతోనే ఈయన కూడా స్టార్ అయిపోయాడు. దానికి ముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశారు రాహుల్. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ కమెడియన్ అయిపోయాడు. ఇక ఈ మధ్య మరో కమెడియన్ ప్రియదర్శితో కలిసి మిఠాయి అనే సినిమా చేశాడు. కొత్త దర్శకుడు ప్రశాంత్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం డిజాస్టర్ అయిపోయింది. కనీసం ఒక్క రోజు కూడా ఆడకుండానే థియేటర్స్ నుంచి వెళ్లిపోయింది మిఠాయి.

రియాలిటీ తెలుసుకున్న రాహుల్ రామకృష్ణ ఈ చిత్రంపై స్పందించాడు. ప్రేక్షకులకు కొత్త ప్రయత్నం అందించాలని ఆశించాం.. అనుకోకుండా ఈ ప్రయత్నం విఫలం అయింది.. నన్ను క్షమించండి ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను అంటూ చెప్పుకొచ్చాడు రాహుల్ రామకృష్ణ. ఈసారి కచ్చితంగా ప్రియదర్శితో కలిసి మంచి కామెడీ పండిస్తానంటున్నాడు ఈ హాస్య నటుడు. దర్శకుడు కథ చెప్పినప్పుడు బాగానే అనిపించిందని.. ఆయనను తాము గుడ్డిగా నమ్మేసామంటున్నాడు రాహుల్. ఇందులో ఆయన తప్పు కూడా ఏమీ లేదని.. ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేకపోవడంతో సినిమా కూడా నిరాశపరిచింది అంటున్నాడు రాహుల్ రామకృష్ణ. ఇకపై సినిమాల్లో కచ్చితంగా ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అవి ఉండేలా చూసుకుంటున్నాడు ఈయన.

More Related Stories